యాప్నగరం

షారుఖ్ సినిమాపై కన్నేసిన తెలుగు నిర్మాతలు

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జోహర్ ఇద్దరూ కలిసి...

TNN 30 Oct 2017, 8:18 pm
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జోహర్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మించిన తమ అప్‌కమింగ్ చిత్రం 'ఇత్తేఫాక్'పై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, సోనాక్షి సిన్హా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో బాగా ట్రేడ్ అవుతున్న చిత్రాల్లో ఒకటి. అందుకే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పలువురు తెలుగు ఫిలింమేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారట.
Samayam Telugu shahrukh khan karan johars film to be remade in telugu
షారుఖ్ సినిమాపై కన్నేసిన తెలుగు నిర్మాతలు


అందులో భాగంగానే తాజాగా ఇత్తేఫాక్ నిర్మాతల్లో ఒకరైన జునో చోప్రా, ఆ సినిమా దర్శకుడు అభయ్ చోప్రాలని సంప్రదించి, ఆ సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

నవంబర్ 3వ తేదీన రిలీజ్ కానున్న ఈ థ్లిల్లర్ సినిమా ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కింది. షారుఖ్ ప్రొడక్షన్ హౌజ్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, కరణ్ జోహర్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.