యాప్నగరం

‘శీలవతి’ టీజర్: ఉయ్యాలపై షకీలా...

శృంగారతార షకీలా ‘శీలవతి’ నంటూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఇటీవల ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసిన షకీలా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. WHAT THE F*** అనేది ఉపశీర్షిక.

TNN 2 Feb 2018, 3:28 pm
శృంగారతార షకీలా ‘శీలవతి’ నంటూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఇటీవల ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసిన షకీలా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. WHAT THE F*** అనేది ఉపశీర్షిక. జీ స్టూడియోస్‌ పతాకంపై మలయాళ స్టార్‌ షకీలా హీరోయిన్‌గా, సాయిరాం దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'శీలవతి'.
Samayam Telugu shakeela seelavathi official teaser released
‘శీలవతి’ టీజర్: ఉయ్యాలపై షకీలా...


షకీలా కెరియర్‌లో 250వ చిత్రం ‘శీలవతి’కాగా.. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన 40 సెకన్ల నిడివిగల టీజర్‌‌లో షకీలా.. తన పాత చిత్రాల ఛాయలు కనిపించకుండా కొత్త పంథాలో కనిపించింది. నిండైన వస్త్రాలు ధరించి పద్ధతిగా కనిపించింది.

రివేంజ్ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘శీలవతి’లో షకీలా ఇంతకు ముందెన్నెడూ చేయని డిఫరెండ్ రోల్ చేయబోతుంది. ఓ పెద్ద బంగ్లాలో రాత్రి పూట టెర్రాస్‌పై ఇద్దరు పిల్లల్ని అటు ఇటుగా కూర్చోబెట్టుకుని వాళ్ల వైపు సీరియస్‌‌గా చూడటం, వెనుక నుండి హరర్ కాన్సెప్ట్ బేస్డ్ మ్యూజిక్ వినిపించడం సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తుంది. ప్రజ్వల్‌ క్రిష్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్‌ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

షకీలా, గీతాంజలి(ఫ్రూటీ), లడ్డు, అశోక్‌బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌, కెమెరా: తరుణ్‌ కరమ్‌తోత్‌, డైలాగ్స్‌: యష్‌ యాదవ్‌, నిర్మాతలు: రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సాయిరాం దాసరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.