యాప్నగరం

​పిల్లల కోసం.. ఈ కఠిన నిర్ణయమన్న షారూక్!

గౌరీ కోసం అలవాట్లను నియంత్రించుకున్న తను.. పిల్లల కోసం ఆ అలవాట్లను పూర్తిగా మానేయాలని డిసైడ్

TNN 21 Mar 2017, 2:19 pm
50 యేళ్ల వయసులో తన పిల్లలతో గడుపుతున్న ఈ సమయం అత్యంత ఆనందాన్ని ఇస్తోందని అంటున్నాడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్. సినిమాల పరంగా కాస్తంత నెమ్మదించినట్టుగా కనిపిస్తున్న ఈ స్టార్ హీరోకి ముగ్గురు పిల్లలు. వీరిలో ఒక కూతురు,కొడుకు టీనేజ్ లో ఉండగా, మూడో కొడుకు ఇంకా చిన్న పిల్లాడు.
Samayam Telugu sharukh to avoid bad habits
​పిల్లల కోసం.. ఈ కఠిన నిర్ణయమన్న షారూక్!

వీరితో గడపడం మధురానుభూతి అని షారూక్ చెబుతున్నాడు.

ఇదే సమయంలో వారి కోసం తనలో తాను కొన్నింటిని మార్చుకుంటున్నట్టుగా కూడా షారూక్ ప్రకటించాడు. పిల్లలతో మరింత ఆనందంగా గడపడానికి, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పొగతాగడం, మద్యం సేవించడాన్ని మానుకోవాలని నిర్ణయించుకున్నాని షారూక్ తెలిపాడు. తనకు దశాబ్దాలుగా ఈ అలవాట్లు ఉన్నాయని షారూక్ వివరించాడు. అయితే.. భార్య గౌరీ పుణ్యమా అని, ఈ అలవాట్లకు పరిమితులు ఉన్నాయని, స్వలంగానే మద్యం సేవిస్తానని, తక్కువ సిగరెట్లు తాగుతానని.. షారూక్ చెప్పాడు. ఆ నియంత్రణ గౌరీ వల్లనే అని అన్నాడు.

గౌరీ కోసం అలవాట్లను నియంత్రించుకున్న తను.. పిల్లల కోసం ఆ అలవాట్లను పూర్తిగా మానేయాలని డిసైడ్ అయ్యానని షారూక్ వివరించాడు. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని షారూక్ అన్నాడు. ఇది వరకూ షారూక్ పొగతాగే అలవాటుతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నిషేధం ఉన్న తరుణంలో ఈడెన్ గార్డెన్స్ లో పొగతాగుతూ పట్టుబడి.. ఆ మైదానంలోకి అడుగుపెట్టడంపైనే ఆంక్షలను ఎదుర్కొన్నాడు షారూక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.