యాప్నగరం

హౌస్ వైఫ్ కానున్న రకుల్ ప్రీత్ సింగ్..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ‘దాగుడు మూతలు’ ఇంటికి ఇల్లాలు కానుంది.

TNN 31 Jan 2018, 10:47 pm
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ‘దాగుడు మూతలు’ ఇంటికి ఇల్లాలు కానుంది. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రల్లో నటించి మెప్పించిన రకుల్ లేటెస్ట్ మూవీలో గృహిణి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్, డీజే లాంటి హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారిన హరీష్ శంకర్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ‘దాగుడు మూతలు’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Samayam Telugu sharwanand and nithin multi starrer movie updates
హౌస్ వైఫ్ కానున్న రకుల్ ప్రీత్ సింగ్..


శర్వానంద్, నితిన్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్.. హీరో నితిన్‌కి జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మే మొదటి వారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ఎవరు నటిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. కాజల్, నివేదా, అనుపమ పరమేశ్వరన్ లాంటి పేర్లు ప్రచారంలో ఉండగా ఎవరిని ఫైనల్ చేస్తారన్నది తేలాల్సి ఉంది. త్వరలో ఈ మూవీకి సంబంధించి అధికారిక సమాచారం వెలువడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.