యాప్నగరం

లై డైరెక్టర్ దర్శకత్వంలో శర్వానంద్ సినిమా

మహానుభావుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ త్వరలోనే మరో రెండు సినిమాలతో బిజీ కానున్నాడు.

TNN 23 Nov 2017, 9:48 pm
మహానుభావుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ త్వరలోనే మరో రెండు సినిమాలతో బిజీ కానున్నాడు. అందులో ఒకటి హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందనుంది. కృష్ణగాడి వీరప్రేమ గాథ, లై సినిమాల డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇవాళే లాంచ్ అయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా శర్వానంద్‌పై మొదటి షాట్ చిత్రీకరించారు.
Samayam Telugu sharwanand hanu raghavapudis film launched today
లై డైరెక్టర్ దర్శకత్వంలో శర్వానంద్ సినిమా


ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్‌ని 2018లో జరపనున్నట్టు మూవీ యూనిట్ సభ్యులు తెలిపారు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.