‘గమ్యం’ వంటి బెంచ్ మార్క్ మూవీతో పాటు, ‘నువ్వా నేనా’ అనే ఎంటర్ టైనింగ్ మూవీలో శర్వానంద్, అల్లరి నరేష్‌ల కాంబినేషన్ సక్సెస్ అయ్యింది. తాజాగా సెల్ఫీరాజా చిత్రానికి శర్వానంద్ వాయిస్ అందించడం ద్వారా వీరు కలసి పని చేయడం ఇది మూడోసారి. అల్లరి నరేష్ కామెడికి ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఉంది. గతంలో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ప్రస్తుతం సెల్ఫీరాజా తెరకెక్కింది. చలసాని రామబ్రహ్మం చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్. ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నారు. సినిమా టైటిల్ నుంచి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విడుదలకు ముందు టూర్ లో విడుదల చేసిన సాంగ్స్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ చిత్రానికి యంగ్ హీరో శర్వానంద్ వాయిస్ ఓవర్ అందిస్తుండటం విశేషం. ఎంటర్టైనింగ్గా సాగే శర్వానంద్ వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ అవుతుందని చిత్రయూనిట్ భావిస్తుంది.
ముచ్చటగా మూడోసారి
‘గమ్యం’ వంటి బెంచ్ మార్క్ మూవీతో పాటు, ‘నువ్వా నేనా’ అనే ఎంటర్ టైనింగ్ మూవీలో శర్వానంద్, అల్లరి నరేష్‌ల కాంబినేషన్ సక్సెస్ అయ్యింది.
TNN 13 Jul 2016, 4:35 am