యాప్నగరం

శర్వానంద్ కోసం 'రాధ' వస్తోంది

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొని సక్సెస్ ఫుల్ చిత్రాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు శర్వానంద్. రీసెంట్‌గా

TNN 24 Feb 2017, 2:52 pm
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొని సక్సెస్ ఫుల్ చిత్రాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు శర్వానంద్. రీసెంట్‌గా 'శతమానం భవతి' సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం తనవైపు తిప్పుకున్న ఈ యంగ్ హీరో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
Samayam Telugu sharwanands new movie title radha
శర్వానంద్ కోసం 'రాధ' వస్తోంది


చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా లావణ్యత్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా శర్వా ఫన్నీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్ 'రాధ' అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ రాధ శర్వాకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.