యాప్నగరం

ఈ బావామరదళ్లు ఏదో చేసేలా ఉన్నారు!

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా విగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'శతమానం భవతి'. గతంలో 'దిల్' రాజు నిర్మించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాని మించేలా...

TNN 29 Dec 2016, 8:19 pm
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా విగేశ్న సతీష్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'శతమానం భవతి'. ఈ సినిమాకి మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. డిసెంబర్ 18న ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. కాగా ఈ సినిమా వీడియో సాంగ్ ప్రోమోలు సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. 'దిల్' రాజు మార్క్ ప్రొడక్షన్ విలువలతో ఎంతో రిచ్‌నెస్‌తో వీడియో కనిపిస్తుంది. గతంలో 'దిల్' రాజు నిర్మించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాని మించేలా అదే జోనర్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్లు అర్థమవుతోది. ఈ సినిమాలోని సూపర్ హిట్ అయిన 'నాలో.. నేను' అనే పాట ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ తాజాగా విడుదల చేశారు.
Samayam Telugu shatamanam bhavati is going to be another seethamma vakitlo sirimalle chettu
ఈ బావామరదళ్లు ఏదో చేసేలా ఉన్నారు!




శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ బావా మరదళ్లుగా నటిస్తున్న' శతమానం భవతి' చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాతా మనవళ్ల మధ్య ఉండే బంధం, బావా-మరదల్ల మధ్య ఉండే అనుబంధం చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రంగా 'శతమానం భవతి' ఉండబోతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.