యాప్నగరం

శతమానం భవతి ఫస్ట్ డే కలెక్షన్స్

శర్వానంద్ గత ఏడాది సంక్రాంతి సీజన్‌లో సాధించినటువంటి విజయాన్నే ఈ ఏడాది కూడా సాధించేందుకు

Samayam Telugu 15 Jan 2017, 4:59 pm
శర్వానంద్ గత ఏడాది సంక్రాంతి సీజన్‌లో సాధించినటువంటి విజయాన్నే ఈ ఏడాది కూడా సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే భారీ చిత్రాల మధ్య పోటీపడేందుకు సైతం ఏమాత్రం వెనుకాడకుండా ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి భారి బడ్జెట్ చిత్రాలతోపాటే తాను నటించిన శతమానం భవతి సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు శర్వా.
Samayam Telugu shathamanam bhavathi first day collections
శతమానం భవతి ఫస్ట్ డే కలెక్షన్స్


శనివారం రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలొచ్చాయి. దీంతో రిలీజైన తొలిరోజే ఈ సినిమా రూ.3.03 కోట్ల షేర్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం శతమానం భవతి ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా వున్నాయి.
నైజాం - రూ. 1.05 కోట్లు
సీడెడ్ -రూ. 35 లక్షలు
ఉత్తరాంధ్ర - రూ. 46 లక్షలు
పశ్చిమ గోదావరి - రూ. 31.15 లక్షలు
తూర్పు గోదావరి - రూ. 39.18 లక్షలు
క్రిష్ణా - రూ. 16.05 లక్షలు
గుంటూరు - రూ. 23.8 లక్షలు
నెల్లూరు - రూ. 8.8 లక్షలు
మొత్తం - రూ. 3.03 కోట్లు

ఇవేకాకుండా ఇండియాకన్నా అమెరికాలో ఒకరోజు ముందే రిలీజైన శతమానం భవతి ప్రీమియర్లకి $ 122,407 కలెక్షన్లు వచ్చినట్టు సమాచారం. సాధారణ బడ్జెట్‌తో రూపొందిన సినిమాకు ఇవి చెప్పుకోదగిన కలెక్షన్లు అనే అనుకోవచ్చంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.