యాప్నగరం

హరితహారం: మొక్కలు నాటిన జీవితా రాజశేఖర్‌

పచ్చదనం పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జీవితా-రాజశేఖర్‌ కుటుంబం పాల్పంచుకుంది. ఆదివారం (జులై 1) తమ కూతురు శివాని పుట్టిన రోజు సందర్భంగా జీవిత, రాజశేఖర్ దంపతులు మొక్కలు నాటారు.

Samayam Telugu 2 Jul 2018, 7:12 pm
పచ్చదనం పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జీవితా-రాజశేఖర్‌ కుటుంబం పాల్పంచుకుంది. ఆదివారం (జులై 1) తమ కూతురు శివాని పుట్టిన రోజు సందర్భంగా జీవిత, రాజశేఖర్ దంపతులు మొక్కలు నాటారు. హైదరాబాద్‌ శివార్లలోని కండ్లకోయ ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద జీవిత, రాజశేఖర్‌‌తో పాటు కుమార్తెలు శివాని, శివాత్మిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని కోసం జీవిత గత మంగళవారమే ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో సమావేశమై చర్చించారు.
Samayam Telugu Jeevitha Rajashekhar


హరితహారం కార్యక్రమంపై జీవిత ప్రశంసలు కురిపించారు. కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారం కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.