యాప్నగరం

తమన్నాకు చేదు అనుభవం.. చెప్పు విసిరిన యువకుడు!

ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మిల్కీ బ్యూటీ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఆదివారం నాడు నగల దుకాణం ప్రారంభానికి వచ్చిన ఆమెపై ఓ ఆకతాయి యువకుడు చెప్పు విసరడంతో కలకలం రేగింది.

TNN 28 Jan 2018, 4:22 pm
ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మిల్కీ బ్యూటీ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఆదివారం నాడు నగల దుకాణం ప్రారంభానికి వచ్చిన ఆమెపై ఓ ఆకతాయి యువకుడు చెప్పు విసరడంతో కలకలం రేగింది. హిమాయత్‌నగర్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దుకాణం ప్రారంభానికి విచ్చేసిన ఆమెపై కరీముద్దీన్‌ అనే బీటెక్‌ విద్యార్థి చెప్పు విసిరాడు. ఈ హఠత్పరిణామానికి తమన్నా షాక్‌కు గురయ్యారు. తన సన్నిహితులతో ఇదే విషయం గురించి వాపోయినట్లు సమాచారం. చెప్పు విసిరిన ఆకతాయిని నారాయణగూడ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నిందితుడు కరీముద్దీన్‌ వారితో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు పక్కనే ఉన్నవారిపై సైతం వాదించినట్లు వీడియోలో రికార్డయ్యింది.
Samayam Telugu shoe hurled at actress tamannaah at hyderabad
తమన్నాకు చేదు అనుభవం.. చెప్పు విసిరిన యువకుడు!


విక్రమ్‌తో నటించిన ఖస్కెచ్ చిత్రం ఇటీవల తమిళంలో విడుదలై విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘క్వీన్‌’రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నీలకంఠ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క కల్యాణ్‌రామ్‌తో ‘నా నువ్వే’ అనే సినిమాలోనూ తమన్నా కథానాయికగా నటిస్తోంది. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.