యాప్నగరం

ప్రభాస్‌తో ఛాన్స్‌.. ఎగిరి గంతేసిన శ్రద్ధా కపూర్

ప్రభాస్‌తో కలిసి సాహో సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నందుకు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చాలా ఎగ్జైట్ అవుతోంది.

TNN 18 Aug 2017, 2:48 pm
ప్రభాస్‌తో కలిసి సాహో సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నందుకు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చాలా ఎగ్జైట్ అవుతోంది. తన ఎగ్జైట్‌మెంట్‌ని ఆపుకోలేని శ్రద్ధా కపూర్ ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తపర్చింది. ఒకవిధంగా శ్రద్ధా కెరీర్‌లో ఇది ఆమెకి ఓ స్పెషల్ మూవీ అనే చెప్పుకోవచ్చు. బాహుబలి సినిమాతో బాలీవుడ్‌లోనూ స్టార్‌డమ్ సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడమే అందుకు ఓ కారణం. అందుకే శ్రద్ధా కూడా అంతగా ఎగ్జైట్ అవుతోంది.
Samayam Telugu shraddha kapoor excited to work prabhas in saaho
ప్రభాస్‌తో ఛాన్స్‌.. ఎగిరి గంతేసిన శ్రద్ధా కపూర్

So so excited to be a part of the 'Saaho' team & to be working with Prabhas!!! Woohoo 🤸🏻‍♀️❤️— Shraddha (@ShraddhaKapoor) August 17, 2017
రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఫైట్స్ కంపోజ్ చేయనుండటం మరో విశేషం. యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న మూవీ కావడంతో అందుకు అనుగుణంగా రొమేనియా, అబు ధాబి, యూరప్ దేశాల్లో ఈ సినిమాలోని అధిక భాగాన్ని తెరకెక్కించనున్నారు. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న 'సాహో' వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.