యాప్నగరం

రణ్‌బీర్ కపూర్‌తో ఎఫైర్‌పై స్పందించిన శృతిహాసన్!

కత్రినా కైఫ్‌తో బ్రేకప్ అయ్యాకా రణ్‌బీర్ కపూర్ పర్సనల్ లైఫ్ చాలా చర్చనియాంశమైంది. రణ్‌బీర్ కపూర్ ప్రతీ యాక్టివిటీ...

TNN 17 Oct 2016, 3:07 pm
కత్రినా కైఫ్‌తో బ్రేకప్ అయ్యాకా రణ్‌బీర్ కపూర్ పర్సనల్ లైఫ్ చాలా చర్చనియాంశమైంది. గాసిప్ రాయుళ్ల పిచ్చాపాటికి రణ్‌బీర్ కపూర్ ప్రతీ యాక్టివిటీ ఓ ముడి సరుకైపోయింది. తాజాగా సౌతిండియన్ బ్యూటీ శృతిహాసన్‌తో రణ్‌బీర్ కపూర్ కలిసి వున్న ఫోటోలు ఇంటర్నెట్‌లోకి రావడంతో ఆ ఇద్దరికీ మధ్య ఎఫైర్ వుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ వాస్తవానికి ఆ ఫోటో ఓ యాడ్ షూటింగ్‌కి సంబంధించినది.
Samayam Telugu shruti haasan clears air about her alleged affair with ranbir kapoor
రణ్‌బీర్ కపూర్‌తో ఎఫైర్‌పై స్పందించిన శృతిహాసన్!


రామయ్య వస్తావయ్యా, దేవ్ డి, తేవర్, గబ్బర్ ఈజ్ బ్యాక్ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ ఆడియెన్స్‌కి సుపరిచితమైన శృతిహాసన్... రణ్‌బీర్ కపూర్‌తో తనకి ఎఫైర్ వుందంటూ వస్తోన్న పుకార్లపై స్పందించింది. అర్థంపర్థంలేని ఈ గాసిప్స్ చూస్తోంటే నవ్వొస్తోంది. నా పనితో నేను చాలా బిజీగా వున్నాను. అంతకుమించి స్పందించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే, ఈ గాసిప్స్ ఏవీ నన్ను ప్రభావితం చేయలేవు అని స్పష్టం చేసింది శృతి. ఇకనైనా ఈ ఇద్దరికీ ఎఫైర్ వుందంటూ వస్తోన్న పుకార్లకి ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి మరి!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.