యాప్నగరం

పాపం.. శృతినే టార్గెట్ చేస్తున్నారు!

స్టార్ హీరో కూతురైనా ఇండస్ట్రీలో శృతిహాసన్‌కు అంత తేలికగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలతో సినిమాలు చేస్తే టాలీవుడ్‌లో ఐరన్ లెగ్ అని ముద్రవేశారు. కానీ..

TNN 10 Jun 2017, 6:40 pm
స్టార్ హీరో కూతురైనా ఇండస్ట్రీలో శృతిహాసన్‌కు అంత తేలికగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలతో సినిమాలు చేస్తే టాలీవుడ్‌లో ఐరన్ లెగ్ అని ముద్రవేశారు. కానీ పట్టు వదలకుండా ప్రయత్నించి సక్సెస్ ఖాతాను తెరిచింది.
Samayam Telugu shruti haasan on being trolled on social media
పాపం.. శృతినే టార్గెట్ చేస్తున్నారు!


తన టాలెంట్‌ను నిరూపించుకొని స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అయితే గత కొన్ని రోజులుగా శృతిహాసన్‌కు ఏది కలిసి రావడం లేదు. ఆమె ఏ సినిమాలో నటించినా ఆ సినిమాను ఆమె మైనస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రేమమ్, కాటమరాయుడు చిత్రాలకు గాను ఆమె దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. తాజాగా హిందీలో నటించిన 'బెహెన్ హోగీ తేరీ' సినిమా పరిస్థితి కూడా అలానే మారింది. విడుదలకు ముందు ఈ సినిమాపై శృతిహాసన్ ఎన్నో అంచనాలు పెట్టుకుంది. పెద్దగా పేరు కూడా లేని రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది.

మొదట్లో అతడితో ఎందుకు నటిస్తున్నావని ప్రశ్నించిన వాళ్ళే ఇప్పుడు రావు పక్కన మరో అమ్మాయి ఉంటే సినిమా బావుండేదని మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఫ్లాప్ కారణాలు వేరే ఉన్నా.. ఈ ఫెయిల్యూర్ మరకని మాత్రం శృతినే భరించాల్సివస్తుంది. నిన్నమొన్నటి వరకు స్టార్ హీరోయిన్ స్టేటస్‌తో వెలిగిపోయిన శృతి ఇప్పుడు సడెన్‌గా క్రేజ్ కోల్పోతుండడం తన బ్యాడ్ టైమ్ అనే చెప్పాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.