యాప్నగరం

బాయ్ ఫ్రెండ్‌తో శ్రుతి హాసన్ చక్కర్లు

బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతూ మీడియా కంటపడిన శ్రుతి హాసన్

TNN 16 Feb 2017, 4:03 pm
టాలీవుడ్, బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులను చేజిక్కించుకుని బిజీగా ఉన్న శ్రుతిహాసన్ షూటింగ్ గ్యాప్‌లో కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతుందట. లండన్‌కి చెందిన హీరో మైకేల్ కార్సెల్‌తో గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మ డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల మైకేల్ ముంబయికి వచ్చినప్పుడు అతనితో కలిసి ఒక రోజంతా శ్రుతి గడపడమే కాకుండా.. దగ్గరుండి సిటీ అంతా తిప్పి చూపించిందట. ఈ విషయమై మీడియా శ్రుతిని ప్రశ్నించగా.. ‘నా వ్యక్తిగత విషయాలు అందరితో చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ తనదైన శైలిలో ఘాటుగా సమాధానమిచ్చింది.
Samayam Telugu shruti hassan dating michael corsale
బాయ్ ఫ్రెండ్‌తో శ్రుతి హాసన్ చక్కర్లు


శ్రుతిహాసన్ ప్రసుత్తం పవన్ కల్యాణ్ సరసన రెండోసారి కాటమరాయుడు సినిమాలో నటిస్తుండగా.. హిందీలో బెహాన్ వోగి తేరి సినిమాలో నటిస్తోంది. గతంలో కూడా శ్రుతిహాసన్ డేటింగ్ గురించి వార్తలు వచ్చినా.. ఎక్కడా మీడియా కంట పడలేదు. కానీ.. తాజాగా లండన్ నటుడితో ముంబయిలో తిరిగిన ఫొటోలు మాత్రం ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తుండటంతో ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.