యాప్నగరం

DJ Tillu-2 షూటింగ్ షురూ.. శ్రీలీల అవుట్.. ఆ హీరోయిన్‌కు ఛాన్స్..?

డీజే టిల్లు-2 (Dj Tillu-2) మూవీ షూటింగ్ షురూ అయింది. హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)పై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఈ సినిమాకు మల్లిక్ రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 28 Sep 2022, 6:20 pm
Samayam Telugu dj tillu 2 shooting
డీజే టిల్లు-2 షూటింగ్ మొదలు
చిన్న సినిమాగా బాక్సాఫీసు ముందుకు వచ్చి.. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది డీజే టిల్లు (Dj Tillu) మూవీ. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంటాయి. విమల్‌ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ తరువాత సిద్ధు పేరు డీజే టిల్లుగా మారిపోయింది. ఆయన అసలు పేరు మర్చిపోయేంతలా ఈ మూవీ ఆడియన్స్‌కు నచ్చేసింది.

డీజే టిల్లు (Dj Tillu-2) పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. చిత్ర బృందం ఈ మూవీ షూటింగ్‌ను మొదలుపెట్టేసింది. డీజే టిల్లు-2 షూటింగ్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డపై కొన్ని సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నైట్ టైమ్‌లో షూటింగ్ షురూ చేశారు.


ఈ సినిమాకు డైరెక్టర్‌, హీరోయిన్ మారిపోయిన విషయం తెలిసిందే. విమల్‌ కృష్ణ స్థానంలో 'నరుడా డోనరుడా', 'అద్భుతం' సినిమాల డైరెక్టర్ మల్లిక్ రామ్ (Mallik Ram) దర్శకత్వంలో తెరకెక్కనుంది. డీజే టిల్లు-2కు సంబంధించిన పిక్‌ను ఆయన షేర్ చేసుకున్నారు. మరోవైపు పార్ట్-1 రాధికాగా నటించిన నేహా శెట్టి ప్లేస్‌లో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఎవరు వస్తున్నారేది మూవీ యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. శ్రీలీలా ఫైనల్ అయిందంటూ ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. తాజాగా కార్తికేయ-2 మూవీతో హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించపోయినా.. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.