యాప్నగరం

Singer Chinmayi: అది నా పర్సనల్.. ప్రెగ్నెన్సీ వార్తలపై సింగర్ చిన్మయి షాకింగ్ పోస్ట్

ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న చిన్మయి.. మీటూ ఉద్యమంలో పాల్గొని దక్షిణాది సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

Samayam Telugu 3 Jul 2021, 6:41 pm
కేవలం సింగర్ గానే కాకుండా సామాజిక అంశాలపై గళం ఎత్తుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సింగర్ చిన్మయి. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ.. సంచలన విషయాలతో హాట్ టాపిక్ అయ్యారు సింగర్ చిన్మయి. తాజాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్లపై రియాక్ట్ అవుతూ ఘాటుగా స్పందించారు చిన్మయి.
Samayam Telugu సింగర్ చిన్మయి


ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవిచంద్రన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సింగర్ చిన్మయి.. ఇటీవల తన మరిది పెళ్లి వేడుకలో మ‌డిసార్ సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించారు. అయితే మ‌డిసార్‌లో ఉండటం వలన సింగర్ చిన్మయి పొట్ట పైకి వచ్చినట్టుగా ఫొటోల్లో కనిపించింది. ఈ ఫొటోపాటుగా చిన్మయి పెళ్లినాటి ఫొటోలో కూడా మ‌డిసార్‌‌లోనే ఉంది. ఈ ఫొటోలు వైరల్ కావడంతో.. దీంతో ఆమె గర్భవతి అంటూ పుకార్లు షికారు చేశాయి.

అయితే వీటిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు చిన్మయి. సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. “ఇది మా పెళ్లిఫోటో.. మ‌డిసార్ వ‌ల‌న నా పొట్ట పెద్ద‌దిగా క‌నిపిస్తుంది. మ‌డిసార్ క్యారీ చేయ‌డం నాకు కుదర్లేదు.. ఇటీవల మా మరిది వివాహంలో కూడా మడిసార్ కట్టాను. అది చూసి నేను ప్రెగ్నెంట్ అని.. వార్తలు వస్తున్నాయి. ఆ వస్త్రాల వలనే నేను అలా కనిపిస్తున్నాను.

అంతేతప్పు నేను ప్రెగ్నెంట్ కాదు.. ఆ పొటోలను చూసి నేను గర్భవతిని అంటూ వస్తున్న పూకార్లు చూసి విసిగిపోయాను. నా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే.. ఆ విష‌యాన్ని మీతో షేర్ చేసుకోవ‌చ్చు లేదా చేసుకోక పోవ‌చ్చు.. అది నా ఇష్టం. అయితే నూటికి నూరు శాతం మా పిల్ల‌ల ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌ను. వారు సోషల్ మీడియాకి దూరంగానే ఉంటారు. ఇక‌నైనా ఈ పుకార్లు ఆపండి’ అంటూ రూమ‌ర్స్‌కి చెక్ పెట్టింది చిన్మయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.