యాప్నగరం

పెళ్లి రోజున సింగర్ సునీత సర్‌ప్రైజింగ్ వీడియో.. రామ్ మంచి కాఫీ లాంటి అబ్బాయ్ అంటూ!

Sunitha Marriage Day: నేడు (జనవరి 9) ప్రముఖ సింగర్ సునీత, రామ్ వీరపనేని పెళ్లి రోజు. ఈ సందర్భంగా ఓ సర్‌ప్రైజింగ్ వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు సునీత. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Samayam Telugu 9 Jan 2022, 5:42 pm
నేడు (జనవరి 9) ప్రముఖ సింగర్ సునీత, రామ్ వీరపనేని పెళ్లి రోజు. గతేడాది సరిగ్గా ఇదే రోజు మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లాడారు సింగర్ సునీత. అప్పటినుంచి వారి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోంది. రామ్ వీరపనేనికి సంబంధించిన పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే సింగర్‌గా తన ప్రొఫెషనల్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు సునీత. అయితే ఈ రోజు తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఓ సర్‌ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేశారు.
Samayam Telugu పెళ్లి రోజున సింగర్ సునీత సర్‌ప్రైజింగ్ వీడియో
Sunitha marriage day


ఇందులో ఈ ఏడాది జరిగిన ఎన్నో మధురమైన అనుభూతులు పంచుకున్నారు సునీత. వెడ్డింగ్ సందర్భంగా తన పెళ్లి వేడుక జ్ఞాపకాలతో పాటు కుటుంబ సభ్యులందరినీ చూపిస్తూ ఫ్యామిలీ ఎంజాయ్ మూమెంట్స్ పంచుకున్నారు. ఈ వీడియోలో సునీత వాళ్లమ్మ మాట్లాడుతూ.. చిరునవ్వు, సహనంతో లైఫ్‌లో సునీత ముందడుగు వేసిందని, ఆమెది డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ పర్సనాలిటీ అని, తన బరువు బాధ్యతలన్నీ తీర్చుకుంటూ వెళుతోందని అన్నారు. సునీత లైఫ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆమె ఆకాక్షించారు.

రామ్ గురించి సునీత మాట్లాడుతూ ఆయనపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. రామ్ చాలా సున్నితమైన వ్యక్తి అని, మంచి మనసున్న మనిషి అని అన్నారు. చాలా ముక్కుసూటిగా ఉండే నిజాయితీ పరుడని చెప్పారు. సుమారు ఎనిమిదేళ్ల నుంచి రామ్ తనకు తెలుసని, అతను మంచి కాఫీ లాంటి అబ్బాయ్‌ అని చెప్పారు సునీత. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సునీత దంపతులకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.
సినీ ఇండీస్ట్రీని భయపెడుతున్న కరోనా.. రాజేంద్ర ప్రసాద్‌కి కోవిడ్ పాజిటివ్
సునీత, రామ్ వీరపనేని ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లే. మొదట 19 ఏళ్ళ వ‌య‌స్సులో సునీత పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక కొన్నేళ్లకు భ‌ర్త‌తో విభేదాలు రావడంతో డైవ‌ర్స్ తీసుకున్న ఆమె పిల్ల‌ల బాధ్య‌త‌ను చూసుకుంటూ కొన్నేళ్ల పాటు ఒంటరిగానే ఉంది. అయితే తన తల్లి సునీత‌కు తోడు కావాల‌ని భావించిన ఆమె పిల్లలిద్దరూ ద‌గ్గ‌రుండి రామ్ వీరపనేనితో ఈ పెళ్లి చేయడం జరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.