యాప్నగరం

డ్రగ్స్ లేకుండా ఉండలేకపోతున్నాడట!

డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు అవి దొరక్కపోతే ఎలా ప్రవర్తిస్తారో.. చాలా సినిమాల్లో చూశాం. అలానే నిజ జీవితంలో కూడా మత్తు పదార్ధాలకు బానిసైన వాళ్ళు ప్రవర్తిస్తుంటారు.

TNN 17 Jul 2017, 3:38 pm
డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు అవి దొరక్కపోతే ఎలా ప్రవర్తిస్తారో.. చాలా సినిమాల్లో చూశాం. అలానే నిజ జీవితంలో కూడా మత్తు పదార్ధాలకు బానిసైన వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. టాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీలకు డ్రగ్స్ అలవాటు చేసిన కెల్విన్ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడట. డ్రగ్స్ సప్లయ్ చేయకముందే కెల్విన్ వాటికి బానిస. అతడికి కూడా రోజు డ్రగ్స్ తీసుకోవడం అలవాటు. పది రోజుల నుండి పోలీస్ కస్టడీలో ఉన్న కారణంగా కెల్విన్‌కు డ్రగ్స్ దొరకడం లేదు. దీంతో అతడు అసలు ఉండలేకపోతున్నాడని, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.
Samayam Telugu sit officials interrogates prime accused kelvin
డ్రగ్స్ లేకుండా ఉండలేకపోతున్నాడట!


వందల మందికి డ్రగ్స్ అలవాటు చేసిన కెల్విన్ ఇప్పుడు మత్తు కోసం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని తెలుస్తోంది. తనకు సిగరెట్లు, డ్రగ్స్ కావాలని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బయటకు రాగానే మీకు డబ్బు ఇస్తానని పోలీసులకు చెబుతున్నాడట. దీన్ని బట్టి కెల్విన్ డ్రగ్స్ కోసం ఎంతగా విలవిల్లాడుతున్నాడో తెలుస్తోంది. గతంలో కూడా కెల్విన్‌ను ఓసారి అరెస్ట్ చేశారు. జైలులో గడిపి మళ్ళీ వచ్చి తన వ్యాపారాన్ని కొనసాగించాడు. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగిస్తానని పోలీసుల దగ్గర చెబుతున్నాడట. మొదట్లో పోలీసులకు సహకరించిన తను ఇప్పుడు నిరాకరిస్తున్నాడని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.