యాప్నగరం

Butta Bomma మూవీ రిలీజ్ వాయిదా.. 10 రోజుల ఆలస్యంగా థియేటర్లలోకి!

Butta Bomma release Date సడన్‌గా మారిపోయింది. సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సూర్య వశిష్ట, అర్జున్‌ దాస్‌, అనిక సురేంద్రన్‌ నటించారు. ఈ మూవీ మలయాళం సినిమా కప్పేలాకి రీమేక్. అయితే జనవరి 26న రిలీజ్ కావాల్సి ఉన్న ఈ మూవీ...?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 21 Jan 2023, 6:06 pm

ప్రధానాంశాలు:

  • బుట్టబొమ్మ మూవీ రిలీజ్ సడన్‌గా వాయిదా
  • జనవరి 26న రిలీజ్ కావాల్సి ఉన్న మూవీ
  • పోస్టర్ నుంచి వార్తల్లో నిలిచిన బుట్టబొమ్మ
  • కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Butta Bomma New release Date
Butta Bomma (బుట్టబొమ్మ)
Butta bomma postponed : ఫస్ట్ పోస్టర్‌తోనే అందరి చూపు తనవైపు తిప్పుకున్న ‘బుట్టబొమ్మ’ (Butta Bomma) సినిమా రిలీజ్ వాయిదాపడింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 26న ఈ మూవీ థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ.. స్పష్టమైన కారణాలు చెప్పకుండానే ఈ చిత్ర యూనిట్.. మూవీ రిలీజ్‌ని వాయిదా వేసుకుంది. ఫిబ్రవరి 4న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు శనివారం ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసింది.
సూర్య వశిష్ట, అర్జున్‌ దాస్‌, అనిక సురేంద్రన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వాస్తవానికి ఈ మూవీ మలయాళం సినిమా‘కప్పేలా’కి రీమేక్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ మొదట్లోనే చెప్పేసింది. అయితే.. పోస్టర్‌ని కూడా కాపీ కొట్టినట్లు నెటిజన్లు ఇటీవల సోషల్ మీడియాలో ఆరోపించారు. ‘ద ప్రెస్టేజ్‌’ మూవీ పోస్టర్‌కి మక్కీకి మక్కీగా ఈ బుట్టబొమ్మ పోస్టర్‌ని దింపేశారు. దాంతో ఓ రేంజ్‌లో ప్రొడ్యూసర్ నాగ వంశీని నెటిజన్లు ఆడేసుకున్నారు.

కేవలం నాగ వంశీనే వాళ్లు టార్గెట్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. అది ఏంటంటే? గత ఏడాది చివర్లో రిలీజైన అవతార్ మూవీపై నాగ వంశీ నెగటివ్‌గా ట్వీట్ చేశారు. దాంతో ఆ కాపీ పోస్టర్‌ని చూపిస్తూ మొట్టికాయలు వేశారు. శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన బుట్టబొమ్మ సినిమా ప్రమోషన్స్‌ని కూడా ఇటీవల గట్టిగా చేశారు. మూవీలో నటించిన
సూర్య వశిష్ట, అర్జున్‌ దాస్‌, అనిక సురేంద్రన్‌ మీడియాకి స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ సడన్‌గా రిలీజ్ వాయిదాపడింది. సోషల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది.


Read Latest Telugu Movies News , Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.