యాప్నగరం

Sonu Sood: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న సోనూసూద్.. 'ఒకే హృదయం ఉంది.. ఎన్నిసార్లు గెలుస్తావు..'

తెరపై విలన్‌గా యాక్ట్ చేసినా.. నిజ జీవితంలో మాత్రం ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా మారిపోయారు సోనూసూద్ (Sonu Sood). ఎంత ఎత్తుకు ఎదిగినా.. సాధారణ వ్యక్తిలా ఉండేందుకు ఆయన ఇష్టపడతాడు. తాజాగా సోనూసూద్‌ ట్రైన్‌ జర్నీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Authored byAshok Krindinti | Samayam Telugu 5 Oct 2022, 9:26 am
సినిమాల్లో విలన్‌గా యాక్ట్ చేస్తూ.. నిజ జీవితంలో ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా నిలుస్తున్నారు నటుడు సోనూసూద్ (Sonu Sood). కరోనా కష్టకాలంలో ఎందరో అభాగ్యులకు అండగా నిలిచారు. సాయం అని అడిగిన వారికి లేదనుకుండా ఆదుకుంటూ.. ఆపద్బాంధవుడిలా చేయూతనందించారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందిపడిన లక్షలాది మందిని సొంతూళ్లకు చేర్చారు. ప్రాంతం, భాష, కులం, మతం.. ఎలాంటి భేదాలు లేకుండా దేశం నలుమూలల నుంచి ఎవరు సాయం కోరినా చేసే సోనూసూద్ పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది.
Samayam Telugu Sonu Sood in Train
రైలులో ప్రయాణించిన సోనూసూద్


సోనూ‌సూద్ సోషల్ మీడియో షేర్ చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతను సామాన్యుడిలా రైలులో ప్రయాణిస్తున్నట్లు వీడియోలో కనిపించారు. స్టేషన్‌లోని బెంచ్‌పై పడుకున్నారు. తరువాత నీళ్లను తాగి చూశారు. ఆ తరువాత రైలుఎక్కి తన ఇంటికి వెళ్లడానికి బయలుదేరారు. కాసేపు సీట్లో కూర్చుంటూ.. డోర్ దగ్గర నిల్చుంటూ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేశారు. ఓ స్టేషన్‌లో ట్రైన్ దిగి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ట్యాప్ వాటర్‌తో మొహం కడుక్కున్నారు. ఆ తరువాత నీళ్లు తాగి.. 'ఈ నీటితో ఏ మినరల్ వాటర్ పోటీపడదు..' అంటూ అక్కడ ఉన్న రైల్వే అధికారితో అన్నారు.
View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood)

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సోనూసూద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'మీరు చాలా గొప్ప వ్యక్తి.. మిమ్మల్ని ప్లాట్‌ఫారమ్‌పై ఇలా చూస్తుంటే.. మీరు మీరేనా లేదా మీలో ఎవరైనా అని అయోమయంలో పడ్దా..' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ''సార్ మీకు ఉన్నది ఒకే హృదయం.. ఎన్నిసార్లు గెలుస్తావు..' అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.