యాప్నగరం

ఎస్పీ చరణ్ భావోద్వేగం.. నాన్న మరణించలేదు.. పాటగా మీలోనే ఉన్నారు

కరోనాతో పోరాడి ఓడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. గత కొన్నిరోజులుగా కరోనాతో పోరాడుతూ శుక్రవారం నాడు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు ఎస్పీ బాలు.

Samayam Telugu 25 Sep 2020, 2:39 pm
సుమారు 50 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు బాలు. ఆయన మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Samayam Telugu ఎస్పీ చరణ్
Sp Charan


తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్‌కి అందించిన ఎస్పీ చరణ్.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నాన్నగారు ఇవాళ (సెప్టెంబర్ 25- శుక్రవారం) స్వర్గీయులయ్యారు. ఆయన కోసం ప్రార్థన చేసిన అందరికీ.. ఎంజీఎం డాక్టర్లకు, స్టాఫ్‌కి కృత‌జ్ఞతలు తెలుపుతున్నాం. నాన్న గారు లేకపోయినా ఆయన పాట ఎప్పుడూ మీతోనే ఉంటుంది.. ఆ పాటే పలకరిస్తుంది. ఆయన మరణించలేదు మీతో మాతో ఆయను ఎప్పుడూ ఉంటారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఎస్పీ చరణ్.

కాగా ఎస్పీ బాలు పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సత్యం థియేటర్‌ వద్ద ఉంచనున్నారు. ఇప్పటికే సత్యం థియేటర్ పార్కింగ్ ప్లేస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి అభిమానులను ఎస్పీ బాలు పార్థివదేహం సందర్శనకు అనుమతించనున్నారు. అనంతరం బాలు అంత్యక్రియలను ఆయన ఫామ్ హౌస్‌లో నిర్వహించనున్నట్టు సమాచారం.
ఫోటోస్: గాన‌గంధ‌ర్వుడు వదిలి వెళ్లిన అరుదైన జ్ఞాపకాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.