యాప్నగరం

‘స్పైడర్’ ల్యాబ్ రిపోర్ట్.. హిట్టు ఖాయమట!

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పైడర్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

TNN 23 Sep 2017, 11:34 am
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పైడర్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ‘స్పైడర్’ సినిమా విషయంలో దర్శకుడు మురుగదాస్ చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలను ఆయన బయటికి రానివ్వలేదు. దీంతో అభిమానుల్లో ఒకింత నిరాశ నెలకొందని టాక్. దీనికి తోడు ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌ కారణంగా రావాల్సినంత హైప్ కూడా ‘స్పైడర్’కు దక్కలేదని కొందరి అభిప్రాయం. దీంతో మహేష్ అభిమానుల్లో ఒకింత టెన్షన్ నెలకొంది. కానీ ఇప్పుడు అందుతున్న ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం మహేష్ ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని సమాచారం.
Samayam Telugu spyder lab report mahesh babu ar murugadoss movie set to be blockbuster
‘స్పైడర్’ ల్యాబ్ రిపోర్ట్.. హిట్టు ఖాయమట!


సెన్సార్ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్, విజువల్ ఎఫెక్ట్స్ చేసిన కంపెనీ నుంచి వస్తోన్న రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. సెకండ్ హాఫ్, ఎస్.జె.సూర్య విలనిజం సినిమా స్థాయిని పెంచేశాయట. ట్రైలర్‌లో చూపించిన ఓ పెద్ద బండరాయి సీన్ సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి అద్భుతంగా ఉంటుందట. మహేష్ దాన్ని అడ్డుకునే సన్నివేశాలు కూడా ఎంతో ఉత్కంఠభరింతంగా ఉంటాయని సమాచారం. సినిమాలో మహేష్‌బాబు ఎంట్రీ సీన్స్, అతడి నటన, ఇంటర్వల్ సీన్స్, సెకండ్ హాఫ్ హైలైట్స్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. దసరాకి కచ్చితంగా మహేష్ హిట్ కొట్టడం ఖాయమని చెప్పుకుంటున్నారు. తమిళనాట కూడా మురుగదాస్ ‘స్పైడర్’తో హిట్ కొడతాడనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది మహేష్ ఫ్యాన్స్‌కి నిజంగా శుభవార్తే కదా..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.