యాప్నగరం

శ్రీదేవిని అర్జున్ కపూర్ అంతగా ఇబ్బంది పెట్టేవాడా?

అతిలోక సుందరి మొదట గుండెపోటుతో మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే ఆమె ప్రమాదవశాత్తు మరణించినట్టు దుబాయ్ వైద్యులు జారీచేసిన ఫోరెన్సిక్ నివేదిక అంటోంది.

TNN 27 Feb 2018, 8:07 am
అతిలోక సుందరి మొదట గుండెపోటుతో మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే ఆమె ప్రమాదవశాత్తు మరణించినట్టు దుబాయ్ వైద్యులు జారీచేసిన ఫోరెన్సిక్ నివేదిక అంటోంది. దీంతో ఆమె మరణం వెనుక అసలు కారణం ఏంటి, ఏం జరిగిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శ్రీదేవి మరణవార్త విని ఆమె బాబాయి వేణుగోపాల్ తన భార్య మరి కొందరు బంధువులతో కలిసి ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బోనీకపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ తనను బాగా ఇబ్బంది పెడుతునట్టు శ్రీదేవి అనేకసార్లు చెప్పి బాధపడేదని వేణుగోపాల్ తెలిపారు.
Samayam Telugu sridevi demise her uncle venugopal reveals interesting facts
శ్రీదేవిని అర్జున్ కపూర్ అంతగా ఇబ్బంది పెట్టేవాడా?


శ్రీదేవి హఠాన్మరణం విషయంలో ఏం జరిగిందో అర్థం కావడం లేదని, తాము కూడా టీవీల్లో చూసే తెలుసుకున్నామని పేర్కొన్నారు. అర్జున్ కపూర్ తనను ఇబ్బంది పెడుతున్నట్టు చెప్పుకుంటూ బంధువుల దగ్గర వాపోయిందని తెలిసిందని వేణుగోపాల్ పేర్కొన్నారు. ఓసారి బోనీకపూర్‌కు షుగర్ లెవెల్ బాగా పెరిగి, అస్వస్థతకు గురైన సందర్భంలో శ్రీదేవి చాలా ఆందోళన చెంది, తానూ, పిల్లలు ఏమైపోతామేమోనని బాధపడిందని తెలియజేశారు.

శ్రీదేవిది చాలా సున్నిత మనస్తత్వమని, తనకు ఎవరితోనూ గొడవలు లేవని స్పష్టం చేశారు. సోదరి శ్రీలతతో ఆమెకు ఉన్నవి ఆస్తి వివాదాలు కావని అన్నారు. అప్పట్లో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శ్రీదేవి తల్లి రాజేశ్వరికి సర్జరీ విషయంలో తప్పిదం జరగడంతో ఆమె చనిపోయారని వివరించారు. ఒకచోట నిర్వహించాల్సిన సర్జరీని మరో చోట చేశారు. దీంతో ఆసుపత్రిపై కేసు పెట్టారని, ఆ తర్వాత డబ్బుల విషయంలో ఇద్దరికీ మనస్పర్థలు వచ్చాయి తప్పితే అంతకుమించి మరేమీ లేదని స్పష్టం చేశారు.

శ్రీదేవికి నాన్-వెజ్ అంటే చాలా ఇష్టమని, అయితే ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక వాటిని తినడం బాగా తగ్గించిందని తెలిపారు. బోనీ కపూర్ కూడా తమతో బాగానే ఉంటారని, చూడగానే గౌరవంతో నమస్కారం పెడతారని అన్నారు. తను ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగినా బంధువులతో మాత్రం ఎలాంటి అరమరికలు లేకుండా కలిసిపోయేదని, మద్రాస్ వెళ్లినా తమను కలుస్తూ ఉండేదని వివరించారు. తాము ఇల్లు కట్టుకుంటున్నామని తెలిసి కొంత సహాయం చేసిందని తెలియజేశారు. అంతేకాదు తనను చూడటానికి వచ్చిన బంధువులకు ఎంతో కొంత ఇచ్చి పంపిస్తుండేదని వేణుగోపాల్ గుర్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.