యాప్నగరం

శ్రీదేవి.. జాన్వీని అతడికిచ్చి పెళ్లి చేయాలనుకుందా?

ఒకవైపు శ్రీదేవి మరణంతో బోనీ కపూర్ కుటుంబం విషాదంలో మునిగిపోగా.. ఈ సమయంలో కొన్ని పాత స్మృతులు కూడా వార్తల్లోకి వస్తూ ఉన్నాయి.

TNN 6 Mar 2018, 2:11 pm
ఒకవైపు శ్రీదేవి మరణంతో బోనీ కపూర్ కుటుంబం విషాదంలో మునిగిపోగా.. ఈ సమయంలో కొన్ని పాత స్మృతులు కూడా వార్తల్లోకి వస్తూ ఉన్నాయి. కూతుళ్లే సర్వస్వంగా బతికిన శ్రీదేవి వాళ్ల విషయంలో కలిగిన ఉండిన ఆలోచనలు మీడియాలో చర్చలోకి వస్తున్నాయి. ప్రత్యేకించి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడానికి సర్వం సిద్ధం చేసి వెళ్లిన అతిలోక సుందరి.. ఆమె విషయంలో ఇంకా ఆసక్తిదాయకమైన ఆలోచనలు కూడా చేసే వారట. తన కూతురు పెళ్లి విషయంలో కూడా శ్రీదేవి ఆలోచనలు చేశారనే మాట వినిపిస్తోందిప్పుడు.
Samayam Telugu sridevi would prefer to see daughter jhanvi kapoor married
శ్రీదేవి.. జాన్వీని అతడికిచ్చి పెళ్లి చేయాలనుకుందా?


అన్ని రకాల శిక్షణనూ ఇప్పించి.. జాన్వీ కపూర్ ను సినిమాల్లోకి తీసుకొచ్చింది శ్రీదేవి. జాన్వీ తొలి సినిమా విడుదలకు సన్నద్ధం అవుతోంది. కూతురు హీరోయిన్ గా సక్సెస్ అయినా కాకపోయినా.. ఒకటే అన్నట్టుగా ఉండేదట శ్రీదేవి. తను స్టార్ హీరోయిన్ కాబట్టి.. తన కూతురు కూడా అలాగే కావాలనే ఆలోచన ఆమెకు ఏమీ లేదట. కొన్ని ప్రయత్నాల వరకూ చూసి.. తర్వాత ఎంచక్కా కూతురికి పెళ్లి చేయాలని శ్రీదేవి భావించేదట.

అందుకు తగ్గ వరుడిని కూడా ఎంపిక చేసిందట శ్రీదేవి. అతడు మరెవరో కాదు.. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ తనయుడు అన్ మోల్ అంబానీ. బోనీ కపూర్ ద్వారా శ్రీదేవికి అంబానీలు బంధువులే అవుతారు. ఈ నేపథ్యంలో.. తన కూతురికి తగిన వరుడిగా అన్ మోల్ ను అనుకునేదట శ్రీదేవి. హీరోయిన్ గా సక్సెస్ అయినా కాకపోయినా.. అన్ మోల్ కు ఇచ్చి జాన్వీకి పెళ్లి చేయాలనేది శ్రీదేవికి ఉండిన ఒక ఆలోచన అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు శ్రీదేవి లేదు. ఆమె ఆలోచన కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.