యాప్నగరం

కొడుకు కోసం ఈ హీరో కొత్త ప్లాన్!

రియల్ లైఫ్‌లో తండ్రీకొడుకులుగా ఉన్న రీల్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించడం కొత్తేమీ కాదు.

TNN 27 Mar 2017, 1:23 pm
ఒకప్పుడు ఎన్టీ రామారావు సినిమాలో బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరావు సినిమాలో నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో మహేష్ బాబు నటించారు. తాజాగా చిరు, చరణ్ కూడా వెండితెరను షేర్ చేసుకున్నారు. తండ్రీకొడుకుల కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు మరో తండ్రీకొడుకుల కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
Samayam Telugu srikanth plans to share screen with his son roshan
కొడుకు కోసం ఈ హీరో కొత్త ప్లాన్!


మొదటి సినిమాకు రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చింది. దీంతో ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు రోషన్. ఇందులో భాగంగా తన తండ్రితో కలిసి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. శ్రీకాంత్ హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయనకు మంచి గుర్తింపు లభిస్తోంది. కాబట్టి తన కొడుకు సినిమాలో నటించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండవు. మరి ఈ కాంబినేషన్‌ను సెట్ చేసే దర్శకుడు ఎవరో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.