యాప్నగరం

శ్రీమతితో ‘శ్రీమంతుడు’ విలన్.. రహస్య వివాహం

రవితేజ ‘పవర్’ చిత్రంలో విలన్‌గా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన హరీష్ ఉత్తమన్ తన ప్రేయసిని వివాహం చేసుకున్నారు.

Samayam Telugu 24 Nov 2018, 12:23 pm
వెండి తెర విలన్ హరీష్ ఉత్తమన్ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రేయసి అమ్రిత కళ్యాణ్‌ పూర్‌ను వివాహమాడాడు. కొంత మంది బంధుమిత్రుల సమక్షంలో ఈనెల మొదటి వారంలో కేరళలోని గురివాయూర్ టెంపుల్‌లో చాలా సింపుల్‌గా వీరి వివాహం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేకప్ ఆర్టిస్ట్ అయిన అమ్రిత కళ్యాణ్‌పూర్‌తో ఐదేళ్లుగా ప్రేమ ప్రయాణం సాగిస్తున్న హరీష్.. పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
Samayam Telugu హరీష్ ఉత్తమన్

రవితేజ ‘పవర్’ చిత్రంలో విలన్‌గా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన హరీష్ ఉత్తమన్.. జిల్, శ్రీమంతుడు, కృష్ణ గాడి వీర ప్రేమగాథ, ఎక్స్‌ప్రెస్ రాజా, దువ్వాడ జగన్నాథమ్, జై లవ కుశ, నా పేరు సూర్య తదితర చిత్రాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు.
2010లో థా చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హరీష్.. తమిళ్‌లో విశాల్ నటించిన సూపర్ హిట్ మూవీ 'పాండియనాడు'లో ప్రతినాయకుడిగా ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ మూవీ అనంతరం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 30 పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు ఎయిర్‌లైన్స్‌లో కేబిన్ క్రూ‌లో సుమారు ఆరేళ్లపాటు విధులు నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.