యాప్నగరం

శ్రీనివాస కళ్యాణం కాన్సెప్ట్ టీజర్ వచ్చేసింది, ఆడియో వేడుక ఆదివారం

శతమానం భవతి చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగ్న డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నితిన్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

Samayam Telugu 19 Jul 2018, 11:23 am
శతమానం భవతి చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగ్న డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నితిన్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, కల్యాణం వైభోగం సాంగ్‌తో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ కాన్సెప్ట్ టీజర్‌ను గురువారం ఉదయం రిలీజ్ చేశారు.
Samayam Telugu srinivas kalyanam


మనం పుట్టినప్పుడు మనవాళ్లందరూ ఆనందపడతారు. మనం దూరమైనప్పుడు మనవాళ్లందరూ బాధపడతారు, అదీ మనకు తెలీదు. మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి, మనవాళ్లందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లి మాత్రమే. పెళ్లి గొప్పదనం గురించి చెప్పే చిన్ని ప్రయత్నమే ‘శ్రీనివాస కల్యాణం’ అంటూ కాన్సెప్ట్ టీజర్‌ను రూపొందించారు. ఈ చిత్ర ఆడియోను జూలై 22న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఆగష్టు 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.