యాప్నగరం

‘శ్రీనివాస కళ్యాణం’ తొలి పాట.. బాలు ఆలపించిన ఆణిముత్యం!

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటుంటే చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటుంది. ఆయన స్వరంలో ఏదో తెలియని ఆకర్షణ.

Samayam Telugu 9 Jul 2018, 8:10 pm
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటుంటే చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటుంది. ఆయన స్వరంలో ఏదో తెలియని ఆకర్షణ. పాశ్చాత్య సంగీతంలో మునిగితేలుతున్న మనకు ఎస్పీబీ పాట వింటే ఓ మంచి తెలుగు పాట విన్నామనే భావన కలుగుతుంది. ఈ మధ్య కాలంలో బాలు పాడిన పాటలు చాలా తక్కువే. కానీ సంవత్సరానికి ఒకటి వచ్చినా అది ఆయన అభిమానులకు ఆనందమే. కిందటేడాది ‘శతమానం భవతి’ సినిమాలో ‘నిలవదే మది నిలవదే’ పాటను బాలు ఆలపించారు. ఆల్బమ్‌కే ఈ పాట హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా బాలు ఆలపించిన మరోపాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
Samayam Telugu Srinivasa_Kalyanam


నితిన్, రాశీ ఖన్నా జంటగా ‘శతమానం భవతి’ ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. సతీష్ వేగేశ్న-దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తోన్న మరో కుటుంబ కథాచిత్రం ఇది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో తొలి పాటను సోమవారం విడుదల చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పెళ్లి పాట అద్భుతంగా ఉంది. ఈ పాట గురించి హీరో నితిన్ ట్వీట్ చేస్తూ.. ‘ఈ ఏడాది ఉత్తమ పెళ్లి పాట ఇది’ అని పేర్కొన్నాడు. ఆల్బమ్‌లో తనకెంతో ఇష్టమైన పాటని తెలిపాడు.
నిజమే.. ఈ పాట వింటే ఎవరికైనా అదే భావన కలుగుతుంది. ఇక ఇక్కడి నుంచి ప్రతి పెళ్లి సీడీలో ఈ పాట తప్పకుండా ఉంటుంది. శ్రీమణి అద్భుతమైన సాహిత్యం అందించారు. మిక్కీ జే మేయర్ మరోసారి వినసొంపైన సంగీతంతో కట్టిపడేశారు. సినిమా ప్రమోషన్‌కు ఈ ఒక్కపాట చాలు అనేట్టుగా ఉంది. మరి అంతగొప్ప పాటను మీరూ వినేయండి. అన్నట్టు ఈ సినిమా ఆగస్టు 9న విడుదలవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.