యాప్నగరం

‘శ్రీనివాస కల్యాణం’ టీజర్: రొమాంటిక్!

‘ఏం.. అబ్బాయిలకే అమ్మాయిలు ముద్దొస్తారా? మాకు రారా?’ అంటూ హీరోయిన్ క్యూట్‌గా అడగడం,

Samayam Telugu 22 Jul 2018, 5:48 pm
సున్నితమైన ప్రేమ సన్నివేశాలు, లీడ్ పెయిర్ మధ్య చక్కటి కెమిస్ట్రీ.. మినిమం ఎంటర్‌టైన్ మెంట్ గ్యారెంటీ.. అనే భరోసాను ఇస్తోంది ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా టీజర్. ‘ఏం.. అబ్బాయిలకే అమ్మాయిలు ముద్దొస్తారా? మాకు రారా?’ అంటూ హీరోయిన్ క్యూట్‌గా అడగడం, అందుకు సమాధానంగా ఆమే హీరోని ముద్దాడటం.. రొమాంటిక్! ఈ మధ్య వరసగా ప్రేమకథా చిత్రల్లోనే నటిస్తోంది రాశీ ఖన్నా. ఇందులో మరోసారి ప్రేయసిగా ఆకట్టుకుంటోంది.
Samayam Telugu srinivasakalyanam


నితిన్‌కు ఇప్పుడు హిట్ అత్యవసరం. చాన్నాళ్ల తర్వాత దిల్ రాజు బ్యానర్లో నటిస్తున్నాడు ఈ హీరో. గతంలో నితిన్‌కు సూపర్ హిట్ ఇచ్చిన నిర్మాత రాజు. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం..వేగేశ్న సతీష్. ఆ మధ్య ‘శతమానంభవతి’తో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ను రూపొందించాడు ఈ దర్శకుడు. ఇప్పుడు లవ్ స్టోరీతో మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్‌నే ఆకర్షిస్తున్నాడు.

‘శ్రీనివాస కల్యాణం’ఈ టైటిల్‌తో దశాబ్దాల క్రితమే ఒక ప్రేమకథ వచ్చింది. వెంకటేష్, భానుప్రియ, గౌతమిల కాంబోలో వచ్చిన ఆ ప్రేమ కథ సూపర్ హిట్. ఆ టైటిల్‌లోని మ్యాజిక్ నితిన్ సినిమాకు కూడా కలిసొచ్చేలానే ఉంది. ఆగస్టు తొమ్మిదిన ఈ సినిమా విడుదల కాబోతోంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.