యాప్నగరం

శ్రుతి హాసన్ పెళ్లి కుదిరిందా...!

కమల్ వెంట కనిపించాడు శ్రుతి హాసన్ సన్నిహితుడు మైఖేల్ కొర్సేల్. ఇతడితో గత కొంతకాలంగా సన్నిహితంగా గడుపుతోంది శ్రుతి.

TNN 2 Mar 2017, 3:04 pm
హీరోయిన్ శ్రుతి హాసన్ కు పెళ్లి కుదిరిందా? త్వరలోనే శ్రుతి లండన్ లోని తన ఇటాలియన్ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కొర్సేల్ తో పెళ్లి పీటలు ఎక్కనుందా? ఈ ఊహాగానాలే వినిపిస్తున్నాయిప్పుడు. లండన్ లో సెటిలైన ఇటాలియన్ యువకుడు మైఖేల్ తో శ్రుతి ప్రేమలో ఉందని ఇది వరకే వార్తలు రావడానికి తోడు, తాజాగా శ్రుతి తండ్రి ‘విశ్వనాయకుడు’ కమల్ హాసన్ లండన్ పర్యటన సందర్భంగా మైఖేల్ ఆయన వెంట కనిపించడంతో... పెళ్లి ఊహాగానాలకు రెక్కలొచ్చాయి.
Samayam Telugu sruthi marriage fixed
శ్రుతి హాసన్ పెళ్లి కుదిరిందా...!


పెళ్లి వ్యవహారం గురించి మైఖేల్ తో కమల్ చర్చించి ఉండవచ్చనే మాట వినిపిస్తోందిప్పుడు. యూకే - ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్-2017 లో పాల్గొనడానికి కమల్ హాసన్ లండన్ వెళ్లాడు. ఈ కార్యక్రమంలో కమల్ వెంట కనిపించాడు శ్రుతి హాసన్ సన్నిహితుడు మైఖేల్ కొర్సేల్. ఇతడితో గత కొంతకాలంగా సన్నిహితంగా గడుపుతోంది శ్రుతి. వీళ్లిద్దరూ కలిసి పలుసార్లు బయట దర్శనం ఇచ్చారు.


అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఆ ప్రచారాన్ని అయితే శ్రుతి ఖండించింది. అలాంటిదేమీ లేదని చెప్పింది. మరి శ్రుతి హాసన్ మాటలకు అర్థాలు వేరు అని.. ప్రేమ నిజమే అని ఆమెను ఎరిగిన వారు అంటున్నారు. తాజాగా కమల్ పక్కన మైఖేల్ కనిపించడం పెళ్లి ఊహాగానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.