యాప్నగరం

Karthikeya Wedding: రాజమౌళి కుమారుడి పెళ్లి.. జైపూర్‌లో టాలీవుడ్ తారల సందడి!

రాజమౌళి కుమారుడి పెళ్లికి టాలీవుడ్ తరలివచ్చింది. మూడు రోజుల పెళ్లిలో సందడి చేసేందుకు తారలంతా జైపూర్‌కు చేరుకున్నారు.

Samayam Telugu 29 Dec 2018, 9:00 am
ర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి వేడుకలో టాలీవుడ్ తారాలు సందడి చేశారు. రాజమౌళి బంధుమిత్రులతో పాటు టాలీవుడ్ ప్రముఖ తారలు నాగార్జున, ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, అనుష్క తదితరులంతా జైపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా డ్యాన్సులు చేస్తూ సరదాగా గడిపారు. వివాహానికి విచ్చేసిన అతిథులకు రాజమౌళి కుటుంబం సర్‌ప్రైజ్ ఇచ్చింది. అతిథుల కోసం కేటాయించిన గదుల తాళాలకు వారి వారి ఫ్యామిలీ ఫోటోలను అతికించి అందజేసింది.
Samayam Telugu Untitled


ఈ వేడుకలో ప్రభాస్, అనుష్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘బాహుబలి’ విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ జంట కలిసి డ్యాన్సులు చేయడం చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. రానా, ఎన్టీఆర్, చరణ్‌లు సైతం బంగ్రా డ్యాన్సులు చేస్తూ పెళ్లి వేడుకలో సందడిగా గడిపారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు సతీసమేతంగా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
రాజమౌళి కుమారుడు కార్తికేయ గతంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ‘బాహుబలి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. కార్తికేయ పెళ్లి చేసుకుంటున్న వధువు పూజా గాయనిగా రాణిస్తున్నారు. డిసెంబరు 30న జైపూర్‌లోని కుకాస్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌లో వీరిద్దరూ ఒకటి కానున్నారు. అనంతరం హైదరాబాదులో రిసెప్షన్ ఇవ్వనున్నారు.




తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.