యాప్నగరం

ముఖ్యమంత్రిగా మహేష్ బాబు పోస్టర్ వచ్చేసింది

మహేష్ కెరియర్‌లో ‘శ్రీమంతుడు’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ.. మహేష్‌తో రెండోసారి వర్క్ చేస్తున్నాడు. కాగా వీరి కాంబో మూవీకి ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రిన్స్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

TNN 23 Jan 2018, 10:29 pm
మహేష్ కెరియర్‌లో ‘శ్రీమంతుడు’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ.. మహేష్‌తో రెండోసారి వర్క్ చేస్తున్నాడు. కాగా వీరి కాంబో మూవీకి ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రిన్స్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వీరి అంచనాలకు తగ్గట్లుగానే మహేష్ 24 మూవీని తీర్చిదిద్దుతున్నాడు కొరటాల శివ. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌‌ను రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తేది ఉదయం 7 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రమోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
Samayam Telugu ssmb24 first oath on 26jan
ముఖ్యమంత్రిగా మహేష్ బాబు పోస్టర్ వచ్చేసింది


ఈ పోస్టర్‌లో మహేష్ బాబు అశేషజనవాహిని మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఉండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొరటాల శివ అంటే తన సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ జనాల్లోకి వెళ్లేలా కథను రెడీ చేస్తాడు. ఈ సినిమాలో కూడా ఓ పొలిటికల్ మెసేజ్‌ను మహేష్‌తో ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఈ మూవీలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడనేది హాట్ టాపిక్ నడించింది.

అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి పోస్టర్‌ను కాని అనౌన్స్‌మెంట్ కాని చేయకపోవడంతో మహేష్ ఈ మూవీలో ముఖ్యమంత్రిగా నటిస్తున్నారా? లేదా అనే అనుమానాలను నివృత్తి చేస్తూ.. మహేష్ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తమ అభిమాన నటుడ్ని సీఎంగా చేస్తుండటంతో ప్రిన్స్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ప్రమోషన్ పోస్టర్ ఈ రేంజ్‌లో ఉంటే జనవరి 26న విడుదలయ్యే ఫస్ట్‌లుక్ పోస్టర్ ఎలా ఉంటుందోనని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు మహేష్ అభిమానులు.

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Get ready to listen to #SSMB24FirstOathOn26Jan pic.twitter.com/lTmYlpAsom — koratala siva (@sivakoratala) January 23, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.