యాప్నగరం

తెలుగులో హాలీవుడ్ హర్రర్ మూవీ ‘ఇట్’

ప్రముఖ అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్ నవల ‘ఇట్’ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ హర్రర్ సినిమా తెలుగులో వస్తోంది.

TNN 18 Aug 2017, 11:36 am
ప్రముఖ అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్ నవల ‘ఇట్’ ఆధారంగా అదే పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ హర్రర్ సినిమా తెలుగులో వస్తోంది. ఆండీ మస్చెట్టి తెరకెక్కించిన ‘ఇట్’ సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అనువాదం చేసి ఒకేసారి విడుదల చేస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. 2013లో వచ్చిన హిట్ మూవీ ‘మామ’ తరవాత ఆండీ మస్చెట్టి దర్శకత్వంలో వస్తున్న హర్రర్ సినిమా కావడంతో ‘ఇట్’పై భారీ అంచనాలున్నాయి.
Samayam Telugu stephen kings horror novel it comes to life on the big screen onseptember 8
తెలుగులో హాలీవుడ్ హర్రర్ మూవీ ‘ఇట్’


కాగా, ఈ చిత్రం గురించి రచయిత స్టీఫెన్ కింగ్ మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా అద్భుతమైన చిత్రం. మీకో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇది కేవలం హర్రర్ మూవీనే కాదు, ఇదొక ప్రతిధ్వని’ అని చెప్పారు. ‘ఇట్’ నవలను స్టీఫెన్ 1980ల్లో రచించారు. ‘ఒంటరిగా ఉండే చిన్న పిల్లలంటే భూతాలకి చాలా ఇష్టం’ అంటూ సాగే తెలుగు ట్రైలర్‌ను ఇప్పటికే వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ విడుదల చేసింది. వచ్చే నెల 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.