యాప్నగరం

దమ్ముంటే.. నన్ను సస్పెండ్ చేయండి: బీజేపీకి హీరోగారి సవాల్!

ఊరికే హెచ్చరించడం కాదు, దమ్ముంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి..

TNN 26 May 2017, 2:21 pm
ఊరికే హెచ్చరించడం కాదు, దమ్ముంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి.. అంటూ సవాల్ విసిరారు భారతీయ జనతా పార్టీ ఎంపీ, ప్రముఖ నటుడు శత్రుఘ్నసిన్హా. బిహార్ నుంచి బీజేపీ తరపున ఎంపీ గా గెలిచిన శత్రుఘ్న గత మూడేళ్ల నుంచి పార్టీలో అసమ్మతి వాదిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీలోనే ఉంటూ.. కమలనాథులను విమర్శించడం, బిహార్ లో బీజేపీ వ్యతిరేక కూటమి లోని లాలూ, నితీశ్ లను ప్రశంసించడం.. చేస్తున్నారు శత్రుఘ్న.
Samayam Telugu stop threatening expel me shatrughan
దమ్ముంటే.. నన్ను సస్పెండ్ చేయండి: బీజేపీకి హీరోగారి సవాల్!


ఈ క్రమంలో ఇటీవల లాలూ ప్రసాద్ ఇళ్లపై ఐటీదాడులపైనా ఘాటుగా స్పందించారు బిహారీ బాబు. వాటిని రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించారు శత్రుఘ్న. దీంతో బీజేపీ బిహార్ విభాగం నేత సుశీల్ కుమార్ మోడీ శత్రుఘ్నపై విరుచుకుపడ్డారు. ఆయనను పార్టీకి శత్రువుగా అభివర్ణించారు. శత్రుఘ్నసిన్హా పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలని సుశీల్ కుమార్ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో స్పందించిన శత్రుఘ్న సిన్హా.. బీజేపీ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఒకవైపు ప్రధాని మోడీని ప్రశంసిస్తూనే.. మిగతా నాయకత్వం తీరును శత్రుఘ్న విమర్శించారు. అంతేగాక.. తాను బెదిరింపులకు భయపడను అని, దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయమని.. ఈ ఎంపీ సవాల్ విసిరారు. మరి ఈ అలనాటి స్టార్ హీరో సవాల్ పట్ల బీజేపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.