యాప్నగరం

ఇంట్లో సింపుల్‌గా కొడుకు బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన బన్నీ

అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ 6వ పుట్టినరోజును ఇంట్లోనే సింపుల్‌గా జరుపుకున్నారు. అమ్మానాన్న, చెల్లెలు అర్హ సమక్షంలో అయాన్ చిన్న కేక్ కట్ చేశారు.

Samayam Telugu 3 Apr 2020, 1:54 pm
చిన్న పిల్లల పుట్టినరోజులు తల్లిదండ్రులకు పండగలాంటిదే. కొత్తబట్టలు కొని, వాళ్లతో కేక్ కట్ చేయించి, పిల్లలందరికీ చాక్లెట్లు పంచి ఎంతో ఆనందంగా పుట్టినరోజు వేడుకను జరుపుకుంటారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. బేకరీలు, రెస్టారెంట్లు కూడా మూతబడ్డాయి. దీంతో పిల్లల పుట్టినరోజు వేడుకలకు దూరమవుతున్నారు. అమ్మానాన్నలతోనే ఇంట్లో సింపుల్‌గా పాయసం తాగి ఊరుకుంటున్నారు. కొంత మంది ఇంట్లోనే చిన్న కేక్ తయారుచేసుకుని పిల్లలతో కట్ చేయిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు కూడా ఇలానే చేశారు.
Samayam Telugu Allu Ayaan Birthday
అల్లు అయాన్ బర్త్‌డే సెలబ్రేషన్


అల్లు అర్జున్ కుమారుడు అయాన్ పుట్టినరోజు నేడు. అయాన్ ఆరో ఏట అడుగుపెట్టాడు. కుమారుడు బర్త్‌డేను గ్రాండ్‌గా నిర్వహించే అవకాశం లేక ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేశారు బన్నీ. ఇంట్లో చేసిన కేక్‌ను కొడుకుతో కట్ చేయించారు. ఈ ఫొటోలను అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుమారుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ప్రేమ అంటే ఏమిటి?? అని నేను నా జీవితం మొత్తం ఆలోచించాను. గతంలో చాలా సార్లు గొప్ప భావాలను నేను ఆస్వాదించాను.. కానీ, అది ప్రేమో కాదో నాకు తెలీదు. కానీ, నువ్వ నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రేమ అంటే ఏమిటో నాకు తెలిసింది. నువ్వే నా ప్రేమ. ఐ లవ్ యూ అయాన్. హ్యాపీ బర్త్‌డే మై బేబీ’’ అని అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు అల్లు స్నేహారెడ్డి ‘‘హ్యాపీ బర్త్‌డే మై బేబీ’’ అని అయాన్ కేక్ కట్‌చేస్తోన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో అయాన్‌తో పాటు బన్నీ, స్నేహారెడ్డి, అర్హ కూడా ఉన్నారు.
View this post on Instagram I used to think “ what is Love ?? “ all my life . Many times in the past I felt strong feelings but was not sure if it was love . But after you came into my life I now know what LOVE is . You are the LOVE . I Love you Ayaan . Happy Birthday My Baby ❤️ A post shared by Allu Arjun (@alluarjunonline) on Apr 2, 2020 at 9:05pm PDT
View this post on Instagram #happybirthday my baby #6 ❤️❤️❤️ A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on Apr 2, 2020 at 8:41pm PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.