యాప్నగరం

సల్మాన్ సినిమాలో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కనున్న 'టైగర్ జిందా హై' మూవీలో ఓ సౌతిండియన్ స్టార్ హీరో విలన్ పాత్ర....

TNN 20 Mar 2017, 5:59 pm
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కనున్న 'టైగర్ జిందా హై' మూవీలో ఓ సౌతిండియన్ స్టార్ హీరో విలన్ పాత్ర పోషించనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు... ఈగ సినిమాలో విలన్‌గా నటించి నంది అవార్డ్ కైవసం చేసుకోవడంతోపాటు బాలీవుడ్ పరిశ్రమ కంట్లో పడిన కన్నడ స్టార్ సుదీప్ కిచ్చనే.
Samayam Telugu sudeep to play villain role in salman khans tiger zinda hai
సల్మాన్ సినిమాలో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో


అలీ అబ్బాస్ జఫర్ డైరెక్ట్ చేయనున్న ఈ యాక్షన్ మూవీకి సుదీప్‌ని విలన్‌గా ఎంపిక చేసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, సుదీప్ మాత్రం ఇంకా ఈ సినిమాకు సైన్ చేయలేదని సమాచారం. ఒకవేళ సుదీప్ ఈ సినిమాలో నటిస్తే, ఆరేళ్ల తర్వాత సుదీప్ మళ్లీ బాలీవుడ్‌లో తన లక్ చెక్ చేసుకోబోతున్నట్టే అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.