యాప్నగరం

చిరంజీవి సినిమాలో సుదీప్ నటించడం లేదట!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా సెట్స్‌పైకి వెళ్లనున్న 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'లో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఓ కీలక పాత్ర...

TNN 10 Aug 2017, 9:31 pm
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా సెట్స్‌పైకి వెళ్లనున్న 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'లో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని వెలువడిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. బాహుబలి తరహాలో నేషనల్ వైడ్ ఆడియెన్స్ కోసం ఈ సినిమాను రూపొందించాలని ప్లాన్ చేస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్... అందుకోసం కన్నడ నుంచి సుదీప్, తమిళం నుంచి శివకార్తికేయన్, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్‌ని తీసుకోవాలని భావిస్తున్నట్టు గత వారం, పది రోజులుగా తెలుగు మీడియాలో పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
Samayam Telugu sudeep will not be the part of chiranjeevis film
చిరంజీవి సినిమాలో సుదీప్ నటించడం లేదట!


అయితే, తాజాగా మూవీ యూనిట్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సుదీప్ గురించి వెలువడిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్‌ని సంప్రదించారనే వార్తల్లో ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి వున్నప్పటికీ... సుదీప్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదనే తెలిసింది. అక్టోబర్‌లో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ ఎవరనేది ఇంకా డిసైడ్ అవలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.