యాప్నగరం

ముచ్చటగా మూడోసారి సుధీర్ బాబు- ఇంద్రగంటి కాంబో.. V తర్వాత మరో స్టెప్

యంగ్ హీరో సుధీర్ బాబు, టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో మరో సినిమా రాబోతోంది. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Samayam Telugu 14 Nov 2020, 5:20 pm
Samayam Telugu ముచ్చటగా మూడోసారి సుధీర్ బాబు- ఇంద్రగంటి కాంబో.. V తర్వాత మరో స్టెప్
Sudheer Babu
తనదైన నటనా ప్రతిభతో మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు మరోసారి టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో జత కట్టారు. వీరిద్దరి కాంబోలో రాబోయే మరో సినిమాను దీపావళి కానుకగా అఫీషియల్‌గా ప్రకటించారు. గతంలో వీరిద్దరి కాంబోలో ''సమ్మోహనం, V'' సినిమాలు వచ్చాయి.

సుధీర్ బాబు కోసం వైవిద్యభరితమైన కథ రెడీ చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ సినిమా రూపొందనుంది. చిత్రంలో సుధీర్ బాబు సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించనుండగా వివేక్ సాగర్ సంగీతం అందించబోతున్నారు.

Also Read: మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త.. నువ్వూ ఓ తల్లివే! అనసూయపై జబర్దస్త్ వర్ష షాకింగ్ కామెంట్స్

రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ సినిమాపై అటు ఇంద్రగంటి, ఇటు సుధీర్ బాబు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారట. అదేవిధంగా ఈ మూవీ లిరిక్స్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన ఇంద్రగంటి.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రిలకు ఆ బాధ్యతలు అప్పగించారు. సుధీర్ బాబు కెరీర్‌లో 14వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రానుంది. అతిత్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనుంది చిత్రయూనిట్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.