యాప్నగరం

సుధీర్‌బాబు 'సమ్మోహనం'

హీరో సుధీర్ బాబు తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఉగాది రోజు కొత్త సినిమా సమ్మోహనం ఫస్ట్ లుక్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది.

Samayam Telugu 18 Mar 2018, 11:33 am
హీరో సుధీర్ బాబు తెలుగు నూతన సంవత్సరాది సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఉగాది రోజు కొత్త సినిమా సమ్మోహనం ఫస్ట్ లుక్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో సుధీర్‌బాబు... పక్కే హీరోయిన్ అదితిరావ్‌లు నిలబడి ఉన్నారు. ఇద్దరూ నవ్వుతున్నట్లు ఉన్న లుక్ అదుర్స్ అనిపించింది. సుధీర్‌బాబు డిఫరెంట్ స్టైల్‌లో కనిపిస్తూ... అదితిని చూసి నవ్వతున్నట్లు స్టిల్స్ ఇచ్చాడు. అదితి కూడా ఎర్రరంగు చుడిదార్‌లో సింపు‌ల్‌గా కనిపించింది. అచ్చ తెలుగు పండుగ... అచ్చ తెలుగు సినిమా సమ్మోనం... సినిమా యూనిట్‌ తరఫున అందరికి శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సుధీర్ బాబు.
Samayam Telugu sudheer babu sammohanam movie first look out
సుధీర్‌బాబు 'సమ్మోహనం'


సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా ఈ పోస్టర్‌ను షేర్ చేసి... ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతకాగా... ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుంది. ఈ ఫస్ట్‌లుక్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

అచ్చ తెలుగు పండుగ .... అచ్చ తెలుగు సినిమా .... ‘సమ్మోహనం’ చిత్ర బృందం తరఫున అందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. #UgadiSammohanam#HappyUgadi @mokris_1772 @aditiraohydari @SrideviMovieOff pic.twitter.com/vGp5QennH3 — Sudheer Babu (@isudheerbabu) March 18, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.