యాప్నగరం

రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన ‘సుల్తాన్’

సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ సినిమా 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లను కొల్లగొట్టింది.

TNN 19 Jul 2016, 3:15 pm
సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ సినిమా 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లను కొల్లగొట్టింది. అతి తక్కువ సమయంలో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి బాలీవుడ్ సినిమాగా సుల్తాన్ రికార్డు నెలకొల్పింది. కేవలం ఇండియాలోనే రూ.300 కోట్లను వసూలు చేసే దిశగా ఈ మూవీ పరుగులు తీస్తోంది. గతంలో సల్మాన్ నటించిన ‘భజరంగీ భాయీజాన్’ భారత్‌లోనే రూ.300 కోట్లను వసూలు చేయగా, మరికొద్ది రోజుల్లో సుల్తాన్ కూడా ఆ చిత్రం సరసన చేరనుంది. తొలి వారంలో కేవలం ఇండియాలోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లను ఈ సినిమా వసూలు చేసిన సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈద్ సందర్భంగా విడుదలై.. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఈ సినిమాలో రెజ్లర్‌గా సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అనుష్క శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అలీ అబ్బాస్ తెరకెక్కించారు. సల్మాన్ నటించిన కిక్, ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాలు రూ.200 కోట్ల క్లబ్‌లో ఉండగా, ఈ కండల వీరుడి 10 సినిమాలు వంద కోట్ల రూపాయల క్లబ్‌లో స్థానం దక్కించుకున్నాయి.
Samayam Telugu sultan movie collects re 500 crore world wide
రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన ‘సుల్తాన్’


Shattering box office records like a true SULTAN! pic.twitter.com/KndfI4zttE — Yash Raj Films (@yrf) July 18, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.