యాప్నగరం

అలనాటి జోడి సుమన్, సుహాసిని మళ్లీ!!

‘అపరాధి’, ‘మాంగళ్య బంధం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటీ,నటులు సుహాసిని, సుమన్‌లు చాలా ఏళ్ల తరువాత వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు.

TNN 30 Jan 2018, 5:41 pm
Samayam Telugu suman and suhasini new movie ninne chusthu updates
అలనాటి జోడి సుమన్, సుహాసిని మళ్లీ!!
‘అపరాధి’, ‘మాంగళ్య బంధం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటీ,నటులు సుహాసిని, సుమన్‌లు చాలా ఏళ్ల తరువాత వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు. వీరభద్ర క్రియేషన్స్ పతాకం‌పై నూతన నటీనటులు శ్రీకాంత్ మరియు హేమ‌ల‌త (బుజ్జి) హీరో హీరోయిన్‌గా నటిస్తున్న ‘నిన్నే చూస్తు’ మూవీలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు ఈ జంట. ఈ సినిమాలో మరో సీనియర్ నటుడు భాను చందర్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వి.ఎస్. ఫణీంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. హేమ‌ల‌తారెడ్డి నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని ఇప్పుడు శరవేగంగా రెండో షెడ్యూల్ ప్రారంభం అయింది. హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా నిర్మాత హేమ‌ల‌తా రెడ్డి మాట్లాడుతూ "మా వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌లో 'నిన్నే చూస్తు' రెండో చిత్రం. ఓ మంచి కుటుంబ కథా చిత్రంగా ‘నిన్నే చూస్తు’ చిత్రాన్ని రూపొందిస్తున్నాము.

సీనియర్ నటులు సుహాసిని, సుమన్ గారు మరియు భాను చందర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. మా చిత్రంలో సుహాసిని గారు నటించటం మా అదృష్టం. వారు నటించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. సుమన్ గారు మా కుటుంబంలో ఒక భాగం గా కలిసిపోయారు. మొదటి షెడ్యూల్ అవుట్ ఫుట్ చూశాక చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల చేస్తాము " అని అన్నారు

భాను చందర్, సుమన్ , కినెర , కాశీ విశ్వనాధ్ , నిహాల్ , వేణు , మహేష్ , ఫణి , రమణ్, జోతిరెడీ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : వి.ఎస్. ఫనీంద్ర, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర, ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.