యాప్నగరం

డోనరుడు చాలా ఓపెన్!

‘నరుడా డోనరుడా’ సినిమాతో చాలా రోజుల తరువాత వెండితెరపై కనిపించిన సుమంత్ తన పర్సనల్ విషయాలపై చాలా ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు.

TNN 15 Nov 2016, 4:16 pm
రుడా డోనరుడా’ సినిమాతో చాలా రోజుల తరువాత వెండితెరపై కనిపించిన సుమంత్ తన పర్సనల్ విషయాలపై చాలా ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు. ఇటీవల తన సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సుమంత్ పలు టీవీ ఇంటర్వ్యూలలో తన పెళ్లి, లవ్‌లపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
Samayam Telugu sumanth latest comments on keerthi reddy
డోనరుడు చాలా ఓపెన్!


సుమంత్ తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే పెళ్లైన రెండేళ్లకే ఈ జంట విడిపోయి ఎవరిదారివారు చూసుకున్నారు. సుమంత్ ఇంకా పెళ్లిచేసుకోకుండా సోలో లైఫ్‌నే ఎంజాయ్ చూస్తుండగా కీర్తిరెడ్డి వేరే పెళ్లిచేసుకుని బెంగుళూరులో స్థిరపడింది.

దిలాఉంటే తాజాగా ఓ టివి ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ కీర్తితో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ తనతో ఇంకా మంచి సంబంధాలే ఉన్నాయని తరచుగా ఫోన్‌లో మాట్లాడుకుంటాం అంటూ ఆసక్తికర విషయాలను మీడియాకి తెలియజేశాడు. విడాకులు తీసుకున్నంత మాత్రాల రిలేషన్ ఉండకూడదా అంటూ 2004లో మా పెళ్లిజరిగింది 2006లో విడిపోయాం, తను వేరే పెళ్లిచేసుకుని హ్యాపీగాఉంది, వాళ్లది చాలా మంచి కుటుంబం, తనతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నా అంటూ తనకు మాత్రం పెళ్లిపై పెద్దగా ఇంట్రస్ట్‌లేదని, పెళ్లి అవసరం అని నేను అనుకోవడంలేదు అందుకే పెళ్లి ఆలోచనలేదు, ప్రస్తుంతం నేను చాలా కంఫర్టబుల్‌గా ఉన్నా భవిష్యత్‌లో నా ఈ ఆలోచన మారిన మారవచ్చుఅని అన్నారు.

అంతేకాదు తనకు స్కూల్‌, కాలేజ్‌లో చాలామందే గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారిని, ప్రస్తుతం ఎవరూ లేరు కాని వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదంటూ తన పర్సనల్‌ విషయాలపై ఓపెన్‌ అయ్యాడు సుమంత్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.