యాప్నగరం

సునీల్ విలన్‌గా సినిమా ప్రారంభం.. హాజరైన సాయి తేజ్

‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ లాంటి స్పూఫ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం ‘కలర్ ఫోటో’ ప్రారంభమైంది. ఈ సినిమాతో కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అలాగే సునీల్ విలన్‌గా మారుతున్నారు. తెలుగుమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

Samayam Telugu 8 Jan 2020, 4:59 pm
‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ లాంటి స్పూఫ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం ‘కలర్ ఫోటో’ ప్రారంభమైంది. ఈ సినిమాతో కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అలాగే సునీల్ విలన్‌గా మారుతున్నారు. తెలుగుమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
Samayam Telugu sunil suhas starrer color photo movie launched
సునీల్ విలన్‌గా సినిమా ప్రారంభం.. హాజరైన సాయి తేజ్


వరుస సినిమాలు

‘ఛాయ్ బిస్కెట్’ ఛానెల్‌తో పాపులర్ అయిన సుహాస్ ఆ తరవాత సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఈ మధ్య కాలంలో ‘మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.

‘ఆత్రేయ’ డైరెక్టర్ క్లాప్

టైటిల్ పోస్టర్‌తోనే బజ్ క్రియేట్ చేసిన ‘కలర్ ఫొటో’ సినిమాను పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభించారు. ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్ర దర్శకుడు స్వరూప్ క్లాప్ కొట్టారు. స్క్రిప్ట్‌ను సునీల్ అందించారు. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, గోపి మోహన్, పవన్ సాదినేని, నిర్మాత రాహుల్ యాదవ్ పాల్గొన్నారు.

డైరెక్టర్ యూట్యూబ్ స్టార్

యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతో సక్సెస్ అందుకున్న యం.యం.కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది. శ్రవణ్ కొంక సమర్పణలో అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్‌టై‌న్మెంట్స్ బ్యానర్లపై సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

See Photo Story: మత్తెక్కించే కళ్లతో.. ఓరచూపులు చూస్తుందిగా రకుల్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.