యాప్నగరం

సునీల్ హీరోగా మరో సినిమా రీమేక్!

ఇది ఒక తమిళ సినిమాకు రీమేక్..

TNN 14 Sep 2017, 12:38 pm
కేవలం హీరో పాత్రలకే పరిమితం కాను, మళ్లీ కమేడియన్ వేషాలను కూడా వేస్తాను అని ఇప్పటికే ప్రకటించేశాడు సునీల్. హీరోగా కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా లేకపోవడంతో సునీల్ మళ్లీ కామెడీ బాట పట్టడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే.. హీరోగా నటించడం మాత్రం ఆపను అని ప్రకటించాడితను. అందుకు తగ్గట్టుగా సునీల్ హీరోగా ఒక సినిమా రాబోతోందని సమాచారం. ఇది ఒక రీమేక్ సినిమా అని తెలుస్తోంది.
Samayam Telugu sunil to remake tamil movie sathuranga vettai
సునీల్ హీరోగా మరో సినిమా రీమేక్!


తమిళంలో విజయవంతం అయిన ‘సతురంగ వెట్టై’సినిమాను తెలుగులో సునీల్ రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. తమిళంలో సంచలన విజయం సాధించింది ఈ థ్రిల్లర్. ఈ నేపథ్యంలో తెలుగులో దీన్ని తీస్తున్నారు. ప్రస్తుతం సునీల్ మలయాళ సినిమా ‘టూ కంట్రీస్’ రీమేక్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి అవుతున్నంతలోనే ‘సతురంగ వెట్టై’ రీమేక్ పట్టాలెక్కనున్నదని సమాచారం.

మరోవైపు ఈ హీరో తాజా సినిమా ‘ఉంగరాల రాంబాబు’ రేపు విడుదల కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.