యాప్నగరం

టైటానిక్ హీరో ఫిల్మ్‌లో భారత్ మహిళ సైంటిస్ట్

హాలీవుడ్ నటుడు, టైటానికి హీరో లియోనార్డ్ డి కాప్రియో సహ నిర్మాతగా నిర్మించిన లఘ చిత్రంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ సునీతా నారాయణ్ నటించారు.

TNN 2 Nov 2016, 4:08 pm
కోల్‌కతాలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ సునీతా నారాయణ్ హాలీవుడ్ నటుడు, టైటానికి హీరో లియోనార్డ్ డి కాప్రియో సహ నిర్మాతగా నిర్మించిన లఘ చిత్రంలో నటించారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవ్ ఫిషర్ స్టీవెన్స్ 95 నిమిషాలు నిడివిగల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాతావరణంలో మార్పులకు మానవుల జీవనశైలి, వినియోగాలే ప్రదాన సమస్యగా రూపొందిన ''బిఫోర్ ది ఫ్లడ్'' (వరదలకు ముందు) డాక్యుమెంటరీలో సునీతను లియోనార్డ్ కలిసి వాతావరణ మార్పులు గురించి చర్చించే సన్నివేశంలో ఆమె నటించారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 30 న నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా భూగోళంపై పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏర్పడే ముప్పు గురించి ఈ సినిమా ద్వారా తెలిపారు. ఇందులో డి కాప్రియో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్, జాన్ కెర్రీ లాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాయకులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలను కలసి వాతావరణంలోని భయంకర మార్పులు, దాని పరిష్కారాల గురించి చర్చించే పాత్రలో నటించారు.
Samayam Telugu sunita narain in leonardo dicaprios documentry film before the flood
టైటానిక్ హీరో ఫిల్మ్‌లో భారత్ మహిళ సైంటిస్ట్


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.