యాప్నగరం

బాలకృష్ణతో సన్నిలియోన్.. ఐటంసాంగ్‌కి మించి ?

ఈమధ్య సన్నీలియోన్ టాలీవుడ్‌కి రెగ్యులర్ గెస్ట్ అయిపోయింది. ఆమె చేతిలో వుండే సినిమాల్లో ఏదో ఒకటి,

TNN 22 Mar 2017, 1:30 am
ఈమధ్య సన్నీలియోన్ టాలీవుడ్‌కి రెగ్యులర్ గెస్ట్ అయిపోయింది. ఆమె చేతిలో వుండే సినిమాల్లో ఏదో ఒకటి, ఏదో ఓ రూపంలో టాలీవుడ్‌కి లింకప్ అయి వుంటుండటమే అందుకు నిదర్శనం. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో ఐటంసాంగ్స్ చేస్తూ కుర్రకారు మతి పోగోడుతున్న ఈ బ్యూటీకి రెండు పరిశ్రమల్లోనూ మంచి ఫాలోయింగే వుంది. మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన కరెంట్ తీగ సినిమాలో సన్నిలియోన్ 'గ్లామరస్ పర్‌ఫార్మెన్స్'ని ఎవరు మాత్రం మరిచిపోగలరు చెప్పండి!
Samayam Telugu sunny leone item song with balakrishnas in his 101 film
బాలకృష్ణతో సన్నిలియోన్.. ఐటంసాంగ్‌కి మించి ?


ఇదిలావుంటే, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ దృష్టి సన్నిలియోన్‌పై పడినట్టు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన రాయిస్ సినిమాలో సన్నిలియోన్ ఐటంసాంగ్ చూసి ఫిదా అయిన పూరి జగన్నాథ్ తన సినిమాలో ఆమెకి ఓ ఐటంసాంగ్ ఆఫర్ చేయాలని భావిస్తున్నట్టుగా తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీ పేర్కొంది. కేవలం ఐటంసాంగ్‌కే ఆమె పాత్రని పరిమితం చేయకుండా... అంతకుమించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది పూరి ఆలోచన అని ఆ కథనం పేర్కొంది. అదే కానీ నిజమైతే, ఐటంసాంగ్స్ ప్రజెంటేషన్‌లో తనదైన స్టైల్ చూపించే పూరి ఇక సన్నిలియోన్‌ని ఎలా చూపిస్తాడా అనే ఊహే ఇప్పుడు కుర్రకారుని గిలిగింతలు పెడుతోంది.

పూరి సినిమాలో సన్ని పాత్రపై అధికారిక ప్రకటనలేవీ లేనప్పటికీ.. ఇది నిజం కాకుండా పోదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బాబు సినిమా సంగతెలా వున్నా... ఆల్రెడీ ఆమె రాజశేఖర్‌తో కలిసి ఓ సినిమాకు సైన్ చేసిన తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.