యాప్నగరం

చెత్త ఊడ్చే వ్యక్తి కొడుకు.. ఆస్కార్స్‌లో మెరిశాడు!

ఆస్కార్ అవార్డ్స్ రేసులో నిల్చిన‘లయన్’ సినిమాలో నటనతో ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న సన్నీ నేపథ్యం మాత్రం ఆసక్తికరంగా ఉంది.

TNN 28 Feb 2017, 4:14 pm
సన్నీ పవార్... భారతీయులకు ఇంకా ఇతడితో అంతగా పరిచయం ఏర్పడలేదు కానీ... హాలీవుడ్ తారలు మాత్రం ఈ పిల్లాడిని అత్యంత మురిపెంగా చూస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ అమెరికన్ ఫిల్మ్ స్టార్స్ చొరవ తీసుకుని సన్నీతో సన్నిహితంగా ఫొటోలు దిగారు. ఆస్కార్ అవార్డుల వేదిక వద్ద సన్నీ ఒక వీఐపీలా వెలిగాడు. ఇతడి తో ఆత్మీయంగా మెలిగారు హాలీవుడ్ అగ్రనటులు, నటీమణులు.
Samayam Telugu sunny pawar background story
చెత్త ఊడ్చే వ్యక్తి కొడుకు.. ఆస్కార్స్‌లో మెరిశాడు!


ఆస్కార్ అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సన్నీ భారతీయుడే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ, ఆస్కార్ అవార్డ్స్ రేసులో నిల్చిన‘లయన్’ సినిమాలో నటనతో ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న సన్నీ నేపథ్యం మాత్రం ఆసక్తికరంగా ఉంది.

ముంబై లోని ఒక మురికివాడకు చెందిన సన్నీ ఆస్కార్స్ లో ఈ స్థాయిలో మెరవడం వెనుక ఆసక్తికరమైన కథే ఉంది. కథానుగుణంగా ఎనిమిదేళ్ల వయసున్న ఒక భారతీయ పిల్లాడి పాత్ర కోసం భారీ స్థాయిలోనే టాలెంట్ హంట్ నిర్వహించాడట ‘లయన్’ సినిమా దర్శకుడు గార్త్ డేవిస్.

ఇండియా అంతా తిరిగి కొన్ని వేల మంది పిల్లలను పరిశీలించాడట. ముంబై, పుణేల్లోని స్కూళ్లలోనే దాదాపు రెండువేల మందిని పరిగణనలోకి తీసుకున్నారట. వారందరి మధ్యనా పోటీలో నిలిచి.. లయన్ సినిమాలో పాత్రకు ఎంపికయ్యాడు సన్నీ.

అంత మంది వడపోతతో ఎంపికయిన సన్నీ లుక్స్, నటన హాలీవుడ్ ను ఆకట్టుకున్నాయి. గొప్ప గుర్తింపు వచ్చింది. అగ్రతారలే అతడి వద్దకు వచ్చి మురిపెంగా దగ్గరకు తీసుకున్నారు. సన్నీ కుటుంబ నేపథ్యంను పరిశీలిస్తే అది చాలా సాదాగా ఉంది.



సన్నీ తండ్రి దిలీప్ పవార్ గతంలో ముంబై లోని ఒక ప్రభుత్వాఫీసులో స్వీపర్ గా పనిచేశాడట. ఆస్కార్ అవార్డుల వేడుక కోసం సన్నీతో పాటు అతడి తల్లిదండ్రులు కూడా అమెరికాకు వెళ్లారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను అపాయింట్ మెంట్ కూడా లభించింది వీళ్లకు.

మరి తన ప్రతిభతో హాలీవుడ్ ను, హాలీవుడ్ స్టార్స్ ను కట్టి పడేసిన సన్నీ కి ఆరంభం అదిరిందనే చెప్పాలి. ఇతడికి హాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని పరిశీలకులు అంటున్నారు. సన్నీ హాలీవుడ్ లో నటుడిగా ఎదిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.