యాప్నగరం

ఆయన లేకపోతే కెమేరా ముందుకెళ్లలేను: మహేష్ బాబు

‘‘మీ మహేష్ ఓ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్‌తో ఉన్నాడు. ఆయన నాతో 24 ఏళ్లుగా ఉంటున్నాడు. ఆయన లేకుండా నేను కెమేరా ముందుకు వెళ్లలేను. అది మరెవరో కాదు.. మై మ్యాన్ ఇన్ బ్లూ, పట్టాభి’’

Samayam Telugu 2 Feb 2018, 2:42 pm
సింప్లిసిటీకి మారుపేరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తన కుటుంబాన్నే కాదు.. తనతో మమేకమైన తన స్టాఫ్‌ను కూడా ఎంతగానో ప్రేమిస్తాడు. అందుకే, మహేష్ బాబును అంతగా గౌరవిస్తారు. వివాదాలకు దూరంగా, అందరితో స్నేహంగా ఉండే మహేష్ బాబు. బాల నటుడి నుంచి టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఎదిగిన మహేష్ బాబు.. హీరో కృష్ణ అబ్బాయి అనే ట్యాగ్‌ను తొలగించుకోడానికి చాలానే కష్టపడ్డాడు. తన టాలెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
Samayam Telugu super star mahesh babu about his makeup man pattabhi
ఆయన లేకపోతే కెమేరా ముందుకెళ్లలేను: మహేష్ బాబు


తాను బాల నటుడిగా ఉన్నప్పటి నుంచి తనతోనే జీవితం సాగిస్తున్న వ్యక్తి కోసం ఆయన ఇటీవల గుర్తు చేసుకున్నారు. ‘‘ఆయన లేకపోతే నేను కెమేరా ముందుకు వెళ్లలేను’’ అన్నాడంటే మహేష్ తన సిబ్బందికి ఇస్తున్న గౌరవం అలాంటిది. గత 24 ఏళ్లుగా తనకు మేకప్ మ్యాన్‌గా ఉన్న పట్టాబి గురించి చెబుతూ మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ ఫొటో పోస్టు చేశాడు.

‘‘మీ మహేష్ ఓ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్‌తో ఉన్నాడు. ఆయన నాతో 24 ఏళ్లుగా ఉంటున్నాడు. ఆయన లేకుండా నేను కెమేరా ముందుకు వెళ్లలేను. అది మరెవరో కాదు.. మై మ్యాన్ ఇన్ బ్లూ, పట్టాభి’’ అంటూ అలనాటి ఫొటో ఒకటి పోస్ట్ చేశాడు. మహేష్ త్వరలో ‘భరత్ అనే నేను’ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.