యాప్నగరం

RRR: మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్‌తో జక్కన్న చర్చలు!

మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్ కూడా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో భాగం కాబోతున్నారట. రాజమౌళి ఆయనతో చర్చలు జరుపుతున్నారట.

Samayam Telugu 3 Feb 2020, 10:43 am
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమా కోసం రాజమౌళి.. సూపర్‌స్టా్ర్ మహేష్ బాబు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో చర్చలు జరుపుతున్నారట.
Samayam Telugu amitabh bachchan mahesh babu
అమితాబ్ బచ్చన్ మహేష్ బాబు


వీరిద్దరి చేత సినిమా బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించిన వాయిస్ ఓవర్ చెప్పించాలని జక్కన్న అనుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సినిమా తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌కు మహేష్ బాబు, హిందీ వెర్షన్‌కు అమితాబ్ చేత వాయిస్ ఓవర్ చెప్పించాలని రాజమౌళి అనుకుంటున్నారట. తమిళం, మలయాళం భాషలకు కూడా అక్కడి సూపర్‌స్టార్ల చేత వాయిస్ ఓవర్ ఇప్పించే పనిలో జక్కన్న ఉన్నట్లు తెలుస్తోంది. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటించనున్నారు. తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించనున్నారు.

READ ALSO: ‘పనీ పాటా లేనివారే బిగ్‌బాస్‌కు వెళ్లేది.. నేనూ అంతే’’

అయితే ఈ సినిమా విడుదల తేదీపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాను జులై 30న రిలీజ్ చేస్తామని 2019లో రాజమౌళి ప్రకటించారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ మొత్తం 10 భాషల్లో విడుదలవుతోంది. అందులోనూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు చాలానే సమయం పడుతుంది. దాంతో చెప్పిన సమయానికి రిలీజ్ చేయడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనికి తోడు కొన్ని వారాల ముందు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో జులై 30న రిలీజ్ అని వేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

సినిమాను జులైలో కాకుండా అక్టోబర్‌లో రిలీజ్ చేసే ఆలోచనల్లో టీం ఉన్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్‌ సినిమా కావటంతో షూటింగ్ పూర్తయినా విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా సమయం పడుతుంది. ముందే డేట్‌ ఇచ్చేసి హడావిడి పడే కన్నా కాస్త నెమ్మదిగా అయిన పూర్తి క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు వస్తే బెటర్‌ అని భావిస్తున్నారట చిత్రయూనిట్. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

READ ALSO: Shakeela Rasina Kutumba Katha Teaser: మూడు రాజధానులు: జగన్‌పై నటి షకీలా పంచ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.